కాంగ్రెస్ లీడర్ రేష్మా హత్య కేసులో ట్వీస్ట్, లంచం తీసుకున్న పోలీసులు, రెడ్ హ్యాండెడ్ గా !

బెంగళూరు: కర్ణాటకలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు రేష్మా పడేకనూర్ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. రేష్మా హత్య కేసులో లంచం ఇవ్వాలని కర్ణాటక పోలీసులు నిందితులను డిమాండ్ చేశారు. నిందితుల నుంచి లంచం తీసుకుంటున్న కర్ణాటక పోలీసులను మహారాష్ట్ర ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

కర్ణాటకలోని విజయపుర జిల్లా, బసవనబాగేవాడి ఉప విభాగం డీఎస్పీ మహేశ్వరగౌడ, రైటర్ (పోలీసు అధికారి)గా పని చేస్తున్న మల్లికార్జున పూజారిని మహారాష్ట్ర ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రేష్మా హత్య కేసులో రియాజ్ కూకటనూర్ అనే వ్యక్తి నుంచి రూ. 1 లక్ష లంచం తీసుకుంటున్న మల్లికార్జున పూజారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Twist to Congress leader Resma Padekanur murder case, police officers arrested in Karnataka

కాంగ్రెస్ నాయకురాలు రేష్మా పడేకనూర్ మే 17వ తేదీ దారుణ హత్యకు గురైయ్యింది. రేష్మా హత్య కేసులో ప్రధాన నిందితుడు తౌఫిక్ ఫైల్మాన్. రేష్మా హత్య కేసులో మీకు సహాయం చెయ్యాలంటే రూ. 5 లక్షలు లంచం ఇవ్వాలని బసవనబాగేవాడి ఉప విభాగం డీఎస్పీ మహేశ్వరగౌడ, రైటర్ మల్లికార్జున నిందితుడు తౌఫిక్ ఫైల్మాన్ కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు.

పోలీసు అధికారులు, రేష్మా హత్య కేసులో నిందితుడు తౌఫిక్ కుటుంబ సభ్యుల మధ్య రాజీ (డీల్) చేసిన మధ్యవర్తి రియాజ్ చివరికి రూ. 1.50 లక్షలు లంచం ఇవ్వడానికి ఇరు వర్గాలను ఒప్పించారు. తౌఫిక్ ఫైల్మాన్ కుటుంబ సభ్యులు రూ. 1 లక్ష లంచం ఇవ్వడానికి అంగీకరించారు.

బసవనబాగేవాడి ఉప విభాగం డీఎస్పీ మహేశ్వరగౌడను అరెస్టు చెయ్యడానికి వచ్చిన మహారాష్ట్ర ఏసీబీ అధికారులు విజయపుర చేరుకున్ని ఆయన్ను పట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకురాలు రేష్మా పడేకనూర్ హత్య కేసులో నిందితులను రక్షించడానికి పోలీసులు లంచం తీసుకున్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

విజయపుర జిల్లా జేడీఎస్ పార్టీ మాజీ అధ్యక్షురాలిగా ఉన్న రేష్మా పడేకనూర్ తరువాత ఆమె పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేష్మా పడేకనూర్ మే 17వ తేదీ దారుణ హత్యకు గురైయ్యింది. రేష్మా పడేకనూర్ హత్య కేసులో సోల్లాపురకు చెందిన ఎంఐఎం నాయకుడు తౌఫిక్ ఇస్మాయిల్ అలియాస్ ఫైల్మాన్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+