ఆవుల్ని దొంగిలించారు: ఇద్దరు దళిత యువకులకు గుండు కొట్టించారు

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఆవులను దొంగిలించినందుకు ఇద్దరు యువకులకు గుండు కొట్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. యూపీలోని బలియాలో ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది.

ఇద్దరు దళిత యువకులు ఆవులను దొంగిలించినందుకు గాను వారికి గుండు కొట్టించి, వీధుల వెంట తిప్పారు. వారి మెడలో ఆవు దొంగలు అని హిందీలో రాసిన ప్లకార్డును పెట్టారు. ఆవులను దొంగిలించినందుకు ఇలా చేసినట్లు పేర్కొన్నారు.

ఆవులను దొంగిలించినందుకు గాను ఉమ, సోను అనే ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Two Dalits thrashed, paraded with placard reading 'cow thief' for allegedly stealing cows in Ballia

ఓ ఆలయంలో ఆవులను దొంగిలించిన ఆ ఇద్దరిని కొందరు గ్రామస్తులు చూశారు. దీంతో వారికి గుండు కొట్టించి రోడ్లపై తిప్పారు. వారిద్దరి పైన చేయి కూడా చేసుకున్నారని పోలీసులు తెలిపారు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్‌చల్ చేస్తోంది. అవులను దొంగిలించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వారిపై చేయి చేసుకున్న వారి విషయంలోను విచారణ జరుగుతోందని చెప్పారు. వారిని కొట్టిన గ్రామస్తుల పైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two Dalit youths were thrashed and their heads shaved for allegedly stealing cows from a temple in Uttar Pradesh's Ballia on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి