Indigo: ఒకే రోజు మూడు విమానాలకు బాంబు బెదిరింపు..!
ఈ మధ్య విమానాలకు బాంబు బెదిరింపులు పెరిగిపోయాయి. ఇవన్నీ ఫేక్ బెదిరింపులే.. వీటితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తాజాగా రెండు ఇండిగో విమానాలకు బాంబ్ బెదిరింపు వచ్చింది. ఈ రెండు ఫ్లైట్స్ అక్టోబర్ 14న ఉదయం ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ కావాల్సి ఉండగా.. బాంబు బెదిరింపుతో ఆగిపోయాయి. ముంబై నుంచి జెడ్డాకు వెళ్తున్న ఇండిగో విమానానికి 6ఈ 56 బాంబు బెదిరింపు రావడంతో అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో బాంబు లేదని నిర్ధారించడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
ముంబై నుంచి మస్కట్ వెళ్తున్న మరో ఇండిగో విమానానికి 6ఈ 1275 బాంబు బెదిరింపు వచ్చింది. విమానాన్ని బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు చేసింది. బాంబు లేదని నిర్ధారించిన తర్వాత విమానం బయల్దేరింది. రెండు ఇండిగో విమానాలతో పాటు ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిరిండియా విమానం ముంబై నుంచి న్యూయార్క్ బయల్దేరింది. విమానంలో బాంబు ఉన్నట్లు ఎక్స్ లో సందేశం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాన్ని వెంటనే ఢిల్లీకి మళ్లీంచారు.

విమానం ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు."అక్టోబర్ 14న ముంబై నుంచి న్యూయార్క్ లోని JFKకి నడుపుతున్న ఫ్లైట్ AI119 నిర్దిష్ట భద్రతా హెచ్చరికను అందుకుంది, ప్రభుత్వ భద్రతా నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఢిల్లీకి మళ్లించారు. ప్రయాణికులందరూ దిగి, ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్‌లో ఉన్నారు" ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
IndiGo flight 6E 56 operating from Mumbai to Jeddah received a bomb threat. As per protocol, the aircraft was taken to an isolated bay, and following the standard operating procedures, mandatory security checks were promptly initiated: Indigo Spokesperson https://t.co/okfUhrdQ63
— ANI (@ANI) October 14, 2024
అక్టోబర్ 11న కొయంబత్తూర్ వయా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానం దాదాపు 6 గంటల పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆగాల్సి వచ్చింది.అక్టోబర్ 5న ఇండోర్‌లోని దేవి అహల్యా బాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. వడోదర ఎయిర్‌పోర్ట్‌కు అదే రోజు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. బాంబు బెదిరింపు మెయిల్స్, కాల్స్ ఎవరు చేస్తున్నారు అనేది దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications