హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం: భయంతో జనం పరుగులు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం వరుస భూ ప్రకంపనలు సంభవించాయి. శనివారం ఉదయం రెండు గంటల వ్యవధిలో మూడు సార్లు స్వల్పంగా భూమి కంపించింది. భారత జియోలాజికల్ సర్వే విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం 6.44 గంటలకు 4.6 తీవ్రతతో మొదటిసారి భూమి కంపించింది.

Two medium-intensity earthquake, epicentred in Kullu, hit the state

ఆ తర్వాత రెండోసారి 7:05 గంటలకు 4.3 తీవ్రతతో, మూడోసారి 4.2 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. కుల్లు ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఒక్కసారిగా భూమికంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. కొన్ని చోట్ల ఇళ్ల గోడలకు బీటలు వారినట్టుగా తెలుస్తోంది. హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో తరచూ భూకంపాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+