అసభ్యంగా లేడీ జర్నలిస్టు పట్ల ఉబేర్ క్యాబ్ డ్రైవర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అరాచానికి పాల్పడ్డాడు. ఓ మహిళా జర్నలిస్టు పట్ల ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించి, వేధించాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్లేందుకు మహిళా జర్నలిస్టు క్యాబ్ మాట్లాడుకుంది.
నోయిడా సెక్టార్ మెట్రో స్టేషన్ సమీపంలో క్యాబ్ డ్రైవర్ రవీందర్ సింగ్ రాంగ్ రూట్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన మహిలా జర్నలిస్టు వెంటనే కారును ఆపించి దిగేసింది. ఆమె నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది.

అయితే కారు డ్రైవర్ ఆమెను వెంబడించాడు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. బాధితురాలు వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు.












Click it and Unblock the Notifications