ఆసుపత్రికి వెలుతున్న మహిళను చితకబాదిన ఉబర్ క్యాబ్ డ్రైవర్, పోయేకాలం !
బెంగళూరు: క్యాబ్, ఆటో బుక్ చేసిన తరువాత డ్రైవర్లు ఓకే చేసిన తరువాత కూడా వారికి ఇష్టం వచ్చిన టైమ్ కు వస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఓలా, ఉబర్ సంస్థలకు చెందిన కొందరు డ్రైవర్లు మహిళా ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించారని. వారిత అనుచితంగా ప్రవర్థించారని ఇఫ్పటికే అనేక ఆరోపణలు రావడంతో కొన్ని కేసులు నమోదు అయ్యాయి.
ఇప్పుడు మహిళా ప్రయాణికురాలి మీద ఉబర్ సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్ నడిరోడ్డు మీద దాడి చెయ్యడం కలకలం రేపింది. మహిళల పట్ట ఇలా ప్రవర్తించే వాళ్లను ఉబర్ సంస్థ ఎలా నియమించుకుంది అంటూ ఐటీ హబ్ బెంగళూరు ప్రజలు మండిపడుతున్నారు. వివాహిత మహిళ అని కూడా చూడకుండా, ఆసుపత్రికి వెలుతున్న ఆమె మీద నడిరోడ్డులో క్యాబ్ డ్రైవర్ దాడి చెయ్యడం కలకలం రేపింది.

కారు కిందకు దిగేందుకు ప్రయత్నించిన మహిళ వేరే క్యాబ్ లో కుర్చోవడానికి ప్రయత్నించింది. ఆ సందర్బంలో ఓ క్యాబ్ డ్రైవర్ రెచ్చిపోయాడు. వివాహిత మహిళ క్యాబ్ దిగి బుక్ చేసుకున్న క్యాబ్ ఎక్కబోతుండగా డ్రైవర్ ఒక్కసారిగా క్యాబ్ ఆపి ఆ మహిళపై దాడికి పాల్పడ్డాడు. అపార్ట్‌మెంట్ ముందు మహిళ తలపై కొట్టిన డ్రైవర్ ఆమె మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.

స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివాహిత మహిళను రక్షించారు. అనంతరం అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఉబర్ క్యాబ్ డ్రైవర్ తీరుతో వివాహిత మహిళతో పాటు స్థానికులు మండిపడుతున్నారు.
ఉబర్ క్యాబ్ డ్రైవర్ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలితో పాటు అపార్ట్ మెంట్ నివాసులు డిమాండ్ చేస్తున్నారు. కేసు విచారణలో ఉందని, మహిళ ఫిర్యాదు చెయయడంతో క్యాబ్ డ్రైవర్ మీద కేసు నమోదు చేశామని బెళ్లందూరు పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయంలో సదరు ఉబర్ సంస్థ ఇంత వరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో బెంగళూరు ప్రజలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications