ముంబై మేడమ్ ఒంటరిగా చిక్కిందని ఉబర్ కారు డ్రైవర్ ఏం చేశాడంటే ?, క్లైమాక్స్ !
బెంగళూరు/ముంబాయి: కారు అద్దెకు తిప్పుకుంటున్న ఓ వ్యక్తి ఆ కారుకు నకిలి పత్రాలు తయారు చేసి ఆ కారును ఉబర్ కంపెనీకి అట్యాచ్ చేశాడు. గుట్టుచప్పుడు కాకుండా నకిలి పత్రాలతో ఉబర్ క్యాబ్ నడుతున్న ఆ వ్యక్తి అదే కారులో ఎయిర్ పోర్టుకు ప్రయాణించిన యువతితో అసభ్యంగా ప్రవర్తించి ఆమె మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించడం కలకం రేపింది.
ముంబాయికి చెందిన యువతి పని మీద ఐటీ హబ్ బెంగళూరుకు వచ్చింది. బెంగళూరులో పని ముగించుకున్న యువతి తిరిగి ముంబాయికి విమానంలో వెళ్లడానికి సిద్దం అయ్యింది. యువతి ఉంటున్న ఏరియా నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంకు వెళ్లడానికి ఆమె మొబైల్ లో ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది.

అమిత్ (33) అనే యువకుడు యువతి ఉన్న ఏరియాకు క్యాబ్ తీసుకెళ్లాడు. దేవనహళ్లిలోని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరకు వెలుతున్న సమయంలో క్యాబ్ డ్రైవర్ అమిత్ కారులో ఉన్న ముంబాయి యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. కారు నిలిపితే తాను దిగిపోతానని ఆ యువతి చెప్పినా వినకుండా అమిత్ కారు వేగంగా నడిపాడు.
కారులో క్యాబ్ డ్రైవర్ ఏం చేస్తాడో అనే భయంతో ఆమె హడలిపోయిందని తెలిసింది. యువతితో అసభ్యంగా ప్రవర్తించిన అమిత్ చివరికి ఆమె మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఎలాగో కారు దిగేసిన ముంబాయి యువతి ఉబర్ క్యాబ్ డ్రైవర్ అమిత్ మీద బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.
యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజుల తరువాత క్యాబ్ డ్రైవర్ అమిత్ ను అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ అమిత్ అసలు బండారం బయటపడింది. నకిలి పత్రాలు తయారు చేసి రెండు సంవత్సరాల నుంచి ఉబర్ కంపెనీకి కారు అట్యాచ్ చేసి క్యాబ్ తిప్పుతున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
అమిత్ కారుకు రెండు సంవత్సరాల క్రితం నకిలి పత్రాలు తయారు చేసి ఇచ్చిన మంజునాథ్, పాలాక్షప్ప అనే ఇద్దరిని బెంగూరులోని హైగ్రౌండ్స్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలి పత్రాలు సమర్పించి మమ్మల్ని మోసం చేశాడని అమిత్ మీద ఉబర్ కంపెనీ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications