Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో చిక్కు: మహిళా ప్యాసెంజర్‌ను బలవంతంగా ముద్దు పెట్టబోయిన ఉబేర్ డ్రైవర్

న్యూఢిల్లీ: మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో ఉబేర్ సంస్థ మరోసారి చిక్కుల్లో పడింది. మహిళా ప్రయాణికుల భద్రతకు ఆ సంస్థ తీసుకుంటున్న చర్యలు మరోసారి ప్రశ్నార్థకంగా మారాయి. ఉబేర్ డ్రైవర్ ఒకతను మహిళా ప్రయాణికురాలిని బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు.

నిరుడు డిసెంబర్‌లో ఓ మహిళపై ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఆప్ బేస్డ్ టాక్సీ సర్వీసులను రద్దు చేసింది. అయినా ఆ క్యాబ్స్ ఢిల్లీ రోడ్లపై తిరుగుతూనే ఉన్నాయి. ఈ తాజా సంఘటన నెల రోజుల క్రితం జరిగింది. బాధితురాలి సోదరుడు మే 30వ తేదీన ఫేస్‌బుక్‌లో కామెంట్ పెట్టడంతో ఆ సంఘటన వెలుగు చూసింది.

Uber driver tries to forcibly kiss woman passenger

గుర్గావ్ నుంచి రావడానికి తమ సోదరి ఉబేర్ క్యాబ్‌ను బుక్ చేసుకుందని, డ్రైవర్ వినోద్ తన సోదరిని బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని, ఉబేర్ కంపెనీకి ఈ విషయంపై ఫిర్యాదు చేశామని, అయినా ఇప్పటి వరకు ఏ విధమైన సమాధానం రాలేదని ఆయన అన్నారు.

ఆ డ్రైవర్‌ను తాము విచారించామని, అటువంటి సంఘటనలను తాము సహించబోమని దానికి ఉబేర్ కంపెనీ సమాధానం ఇచ్చింది. ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివ కుమార్ యాదవ్ 25 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసిన సంఘటన తర్వాత ఈ సంఘటన జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+