ఈసీ మోడీకి బానిస- నిప్పులు చెరిగిన ఉద్ధవ్ థాక్రే-ఎన్నికలకు సిద్ధం కావాలని అనుచరులకు పిలుపు..
శివసేనపై హక్కుల్ని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేకు కట్టబెడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, ఆ వెంటనే పార్టీ గుర్తుతో పాటు పేరును మారుస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ఇవాళ నిప్పులు చెరిగారు. ఈసీ నిర్ణయం వెనుక ప్రధాని మోడీ ఉన్నారని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు, ఈసీ నిర్ణయాల నేపథ్యంలో తన నివాసం మాతోశ్రీ వద్ద భారీగా చేరుకున్న అనుచరులతో మాట్లాడిన ఉద్ధవ్ థాక్రే.. ఈసీ ప్రధాని మోడీ చేతిలో బానిసగా మారిందని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్ధితి లేదన్నారు. తన అనుచరులంతా శాంతియుతంగా ఉండాలని, ముంబై కార్పోరేషన్ బీఎంసీకి వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తన తండ్రి బాల్ థాక్రేను గుర్తుచేసేలా తన కారు సన్ రూఫ్ లో నుంచి నిలబడి ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ పార్టీ చిహ్నం దొంగతనానికి గురైందని, దొంగకు తగిన గుణపాఠం చెప్పాలంటూ ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండేను ఉద్దేశించి ఉద్ధవ్ థాక్రే విమర్శలు గుప్పించారు. శివసేన పార్టీ నియంత్రణపై జరిగిన సుదీర్ఘ పోరాటంపై 78 పేజీల ఉత్తర్వులో 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచిన 76 శాతం ఓట్లతో షిండేకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం గత ఏడాది కేటాయించిన 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే' పేరును, 'జ్వలించే టార్చ్' చిహ్నాన్ని అలాగే ఉంచుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.
-
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications