మొగాంబో హ్యాపీయేగా..! ముంబైని శివసైనికులు రక్షించినప్పుడు మీరెక్కడ ? ఉద్ధవ్ థాక్రే కామెంట్స్
మహారాష్ట్రలో శివసేన వర్గాల మధ్య జరిగిన పోరులో సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు ప్రకటించింది. ఇందులో ఇన్నాళ్లు శివసేన అధినేతగా ఉన్న ఉద్ధవ్ థాక్రేను కాదని, ఎమ్మెల్యేల్ని తనవైపు తిప్పుకుని ముఖ్యమంత్రి అయిన ఏక్ నాథ్ షిండేను అధిపతిగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతకంటే ముందే ఎన్నికల సంఘం సైతం షిండేకే శివసేన పేరు, పార్టీ చిహ్నం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరోసారి ఉద్ధవ్ మండిపడ్డారు.
శివసేన పేరు, గుర్తు కేటాయింపు వివాదంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోషించిన పాత్రపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ఇవాళ మండిపడ్డారు. మొగాంబో ఆశ తీరిందంటూ ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ సినిమా మిస్టర్ ఇండియాలోని డైలాగ్ మొగాంబో ఖుష్ హువా (మొగాంబో కోరిక తీరింది )ని ఉద్ధవ్ గుర్తుచేశారు.
1993 ముంబై పేలుళ్ల సమయంలో శివసైనికులు ముంబైని రక్షించినప్పుడు ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడే వారు ఎక్కడ ఉన్నారు,అడ్రస్ తెలియట్లేదని ఉద్ధవ్ వ్యంగంగా ప్రశ్నించారు.

ఇప్పుడు వారు 56-అంగుళాల ఛాతీ (ప్రధాని మోడీ) గురించి గొప్పగా చెప్పుకుంటారని, ఆ 56 అంగుళాల ఛాతీ అప్పుడు ఎక్కడ ఉందని, చెమటలు పట్టాయి అంటూ మోడీని సైతం ఉద్ధవ్ చీల్చి చెండాడారు. ఒకప్పుడు ప్రజలు ర్యాలీల్లో మోదీ మాస్క్‌లు ధరించగా, ఇప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే ముసుగులో ఉన్న ప్రధాని మోదీయేనని, తన తండ్రి వారసత్వం కోసం బీజేపీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో నెలల తరబడి సాగిన పోరాటాన్ని గుర్తుచేశారు. ఎన్నికల సంఘం తాజాగా షిండేకి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉద్ధవ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications