బిగ్ షాక్.. 1.17 కోట్ల ఆధార్ కార్డులు రద్దు.. వాటిల్లో మీ నెంబర్ ఉందా..? ఇలా చెక్ చేసుకోండి..
ప్రతి భారతీయుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. అన్నింటికి ఆధార్ ప్రామాణికంగా మారిపోయింది. అయితే తాజాగా దాదాపు 1.17 కోట్ల ఆధార్ కార్డులను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) రద్దు చేసింది. మరణించిన వారి ఆధార్ నంబర్లను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 1.55 కోట్ల మరణాలు రికార్డుల్లో నమోదయ్యాయని వాటిల్లో 1.17 కోట్ల ఆధార్ నంబర్లను రద్దు చేసినట్లు యూఐడీఏఐ తెలిపింది.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మరణించినవారి ఆధార్ కార్డులను రద్దు చేయకపోవడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ కార్డులు దుర్వినియోగం అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దాంతో మరణించిన వారి ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 1.55 కోట్ల మరణాలు రికార్డుల్లో నమోదు కాగా వాటిల్లో 1.17 కోట్ల ఆధార్ నంబర్లను రద్దు చేసినట్లు యూఐడీఏఐ తెలిపింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి కూడా మరణ రికార్డులను సేకరించే యోచనలో ఉన్నట్లు యూఐడీఏఐ పేర్కొంది.
యూఐడీఏఐ.. భారత రిజిస్ట్రార్ జనరల్ ను ఆధార్ నంబర్లతో అనుసంధానం అయిన మరణాల రికార్డులను తెలపాలని అభ్యర్థించింది. దీని ద్వారా సిటిజన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS)ను ఉపయోగించి 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 1.55 కోట్ల మరణాల రికార్డులను సేకరించింది. వీటిల్లో ధ్రువీకరణ తర్వాత సుమారు 1.17 కోట్ల ఆధార్ నంబర్లను అధికారులు డీయాక్టివేట్ చేశారు. CRS తో అనుసంధానం లేని ప్రాంతాలలోనూ ఇదే విధమైన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

మరి మీ ఆధార్ యాక్టివ్ గా ఉందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. మొదట యూఐడీఏఐ https://myaadhaar.uidai.gov.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి.. ఆ తర్వాత వెరిఫై ఆధార్ నంబర్ అనే సెక్షన్ పై క్లిక్ చేసి.. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చాను నింపాలి. అనంతరం ప్రొసీడ్ టు వెరిఫై అనే ఆప్షన్ పై క్లిక్ చేసి.. మీ ఆధార్ యాక్టివ్ గా ఉందా లేదా చెక్ చెక్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications