భారత స్టూడెంట్స్ పై పిడుగు: ఆ దేశ విసా చాలా కాస్ట్లీ: ఫండ్స్ భారీగా పెంపు

ఉన్నత చదువులు చదవాలని ఆశిస్తున్న భారతీయ విద్యార్థులకు బ్రిటన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యూకే వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. అక్కడ చదువుకునేందుకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులు ఇకపై తమ నివాస ఖర్చుల కోసం చూపించాల్సిన కనీస మెయింటెనెన్స్ ఫండ్ పరిమితిని భారీగా పెంచింది. ఈ ఏడాది నవంబర్ 30 నుంచి దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ నూతన నిబంధనలు వర్తిస్తాయి.

యూకే హోమ్ శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. విద్యార్థులు చదువుకునే ప్రాంతాన్ని బట్టి వారు చూపించాల్సిన ఫండ్ పరిమితి మారుతుంటుంది. లండన్‌లో నివసిస్తూ చదువుకునే విద్యార్థులు ప్రతి నెలా చూపించాల్సిన ఫండ్ మొత్తం 1,529 అంటే.. సుమారు రూ. 1.95 లక్షల నుంచి 1,570 పౌండ్ లకు.. సుమారు రూ. 2.01 లక్షలకు పెంచారు. ఈ తాజా పెంపు వల్ల విద్యార్థులు తమ నిధులను ముందుగానే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

UK Student Visa Soon Requires Higher Maintenance Funds New Limits From Nov 30 Amounts Increase

లండన్ వెలుపల గల యూనివర్శిటీల్లో ప్రవేశాలు పొందే విద్యార్థుల జీవన వసతి ఖర్చుల నిబంధన కూడా పెరిగింది. ప్రస్తుతం ఉన్న నెలవారీ పరిమితి 1,171 నుంచి 1,203 యూరోలకు పెరిగింది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ. 1.54 లక్షలు అవుతుంది. విద్యార్థులు గరిష్టంగా తొమ్మిది నెలల కాలానికి సరిపడా మెయింటెనెన్స్ ఫండ్స్ నిల్వలను దరఖాస్తు సమయంలో పొందుపర్చాల్సి ఉంటుంది. దీని ప్రకారం లండన్ పరిధిలో చదువుకునే వారు గరిష్టంగా రూ. 18.06 లక్షలు అంటే 14,130 పౌండ్లు, ఇతర ప్రాంతాలలో విద్యనభ్యసించే వారు దాదాపు రూ. 13.84 లక్షలు 10,827 పౌండ్లను మెయింటెనెన్స్ ఫండ్స్ చూపించాలి.

విజయ్ ఏమనుకున్నా సరే..మా నిర్ణయం ఇదే: తేల్చి చెప్పిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్
విజయ్ ఏమనుకున్నా సరే..మా నిర్ణయం ఇదే: తేల్చి చెప్పిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్

ఈ మొత్తం మెయింటెన్స్ ఫండ్స్ కోసం మాత్రమే. కాలేజీ ట్యూషన్ ఫీజు దీనికి అదనం. బ్రిటన్ ప్రభుత్వం స్థానిక విద్యార్థులకు అందించే వార్షిక మెయింటెన్స్ లోన్లకు అనుగుణంగానే అంతర్జాతీయ విద్యార్థుల ఆర్థిక పరిమితులను కూడా సమం చేయాలని నిర్ణయించడమే దీనికి ప్రధాన కారణం. దీంతో పాటు వీసాలో జరిగే దుర్వినియోగాన్ని అరికట్టడం, అర్హత గల విద్యార్థులకు మాత్రమే వాటిని మంజూరు చేయడానికి ఈ కఠిన నిబంధనలను తీసుకువచ్చినట్లు హోమ్ ఆఫీస్ స్పష్టం చేసింది.

ఎల్లుండే.. ప్రెస్ ముందుకు సాయిరెడ్డి: బిగ్ అనౌన్స్‌మెంట్ గ్యారెంటీ?
ఎల్లుండే.. ప్రెస్ ముందుకు సాయిరెడ్డి: బిగ్ అనౌన్స్‌మెంట్ గ్యారెంటీ?

భారతీయ విద్యార్థులు ఈ ఫండ్ మొత్తాన్ని యూకే ప్రభుత్వానికి ఎలాంటి ఫీజుల రూపంలో చెల్లించనక్కర్లేదు. వీసా ఆమోదం కోసం తమ బ్యాంక్ ఖాతాలలో ఈ నిధుల లభ్యతను చూపించితే సరిపోతుంది. ఈ ఏడాది నవంబర్ 30 తర్వాత వీసా దరఖాస్తులు సమర్పించే వారంతా పాత నియమాలను కాకుండా ఈ నూతన రేట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వారి వీసా రిజెక్ట్ అవుతుందని హోమ్ శాఖ తెలిపింది.

జనవరి ఇన్‌టేక్‌లో లండన్ లేదా బ్రిటన్ లోని ఇతర నగరాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కొత్త మార్పులను గమనించాలి. బ్రిటిష్ వీసా పొందడానికి వీసా కార్యాలయానికి సమర్పించే బ్యాంక్ ఖాతాలలో మునుపటి కంటే చాలా ఎక్కువ నిల్వ నిధులను చూపించాల్సి ఉంటుంది. విద్యార్థులు అక్కడికి వెళ్లిన తర్వాత వారి స్థానిక నివాసం, ఆహారం, ఇతర అత్యవసర ఖర్చులకు లోటు లేకుండా ఉండేందుకే ఈ మార్పులు చేసినట్లు బ్రిటన్ హోమ్ శాఖ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+