SBIలో రూపాయి మిగల్చకుండా ఊడ్చి పడేశారు: సీసీటీవీ ఫుటేజీలో..

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో భారీ దోపిడీ చోటు చేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో క్యాష్ డిపాజిట్లు, బంగారం, నగలు, ఇతర ఆభరణాలను దుండగులు దోచుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం.. జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

జిల్లాలోని చడచణ టౌన్ లో గల ఎస్బీఐ శాఖా కార్యాలయంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉంటుందీ పట్టణం. మిలిటరీ దుస్తులు ధరించిన ఈ ముఠా, నాటు తుపాకులు, ఇతర ఆయుధాలతో విజయపుర బ్యాంకులోకి చొరబడ్డారు. అక్కడి ఉద్యోగులు, ఇతర సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. తాళ్లతో కట్టివేశారు. నోట్లో గుడ్డలు కుక్కారు. అంతకుముందే కొన్ని సీసీటీవీలను సైతం ధ్వంసం చేసినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. సినీ ఫక్కీలో ఉడాయించారు.

Unbelievable Heist SBI Bank in Karnataka Hit with 59 Kg Gold and 8 Crore Cash Theft

ఈ దోపిడీలో మొత్తం 59 కేజీల బంగారం, ఎనిమిది కోట్ల రూపాయల నగదు చోరీకి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం అయిదుమంది గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు ధరించి సైనిక దుస్తుల్లో నాటు తుపాకులతో బ్యాంకులోకి ప్రవేశించారు. బ్రాంచ్ మేనేజర్, క్యాషియర్, ఇతర ఉద్యోగులను బెదిరించి, వారిని వెంట తెచ్చుకున్న తాళ్లతో కట్టేశారు. బ్యాంకులో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నారు.

సమాచారం అందిన వెంటనే విజయపురా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నింబలగి.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఈ దోపిడీ ఘటనపై మహారాష్ట్ర పోలీసుల సహకారాన్ని కూడా తీసుకుంటోన్నారు. వారితో కలిసి జాయింట్ గా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+