బెంగళూరు కాలేజ్ అమ్మాయి రేప్ కేసులో ట్విస్ట్, బాయ్ ఫ్రెండ్ ను వదిలి బైక్ లో?

బెంగళూరులో గ్రాడ్యుయేట్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అంతకుముందు అమ్మాయిని ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఆరోపించారు. కానీ ఇప్పుడు ఆమెను బైక్‌పై డ్రాప్ ఇస్తామని నమ్మించిన నిందితుడు తరువాత బైక్ లో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలోని షెడ్డులోకి తీసుకెళ్లి బట్టలు చింపేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తెలిసింది.

హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిదిలో జరిగిన అత్యాచార ఘటనపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన బెంగళూరు తూర్పు డివిజన్‌ ​​అదనపు పోలీసు కమిషనర్‌ రామన్‌గుప్తా శనివారం అర్దరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. మహారాష్ట్రకు చెందిన బాధితురాలు అనేకల్ సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతోందని అన్నారు శనివారం ఆమె స్నేహితురాలితో కలిసి కోరమంగళలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌ పార్టీకి వెళ్లిందని వివరించారు. రాత్రి ఏం జరిగిందో అడిషనల్ పోలీసు కమిషనర్ రామన్ గుప్తా ఇలా వివరించారు.

అనంతరం రాత్రి తిరిగి ఆమో రూమ్ దగ్గరకు వెళ్తుండగా ఆ యువతి ఆమె స్నేహితురాలి కారు నడుపుతానని చెప్పింది. ఆ యువతి కారు నడిపింది. అయితే కారును సరిగ్గా నడపలేకపోవడంతో మూడు ఆటోలను ఆ కారు డీకొట్టింది. ఆ యువతిపై ఆటో డ్రైవర్లు గొడవ చేశారు. దీంతో ఆ యువతి భయంతో పోలీస్ హెల్ప్ లైన్ 112కు ఫోన్ చేసింది.

తరువాతపోలీసులు వచ్చి తనను అరెస్ట్ చేస్తారనే భయంతో యువతి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోవాలని ప్రయత్నించింది.తన గదిలోకి వెళ్లేందుకు అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తి బైక్ అడ్డగించి తనకు డ్రాప్ ఇవ్వాలని ఆ యువతి మనవి చేసింది. అప్పుడు ఓ బైకర్ నేను ఆ ప్రాంతానికి వెళ్లను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదే దారిలో మరో బైకర్ రాగా అతనని తన రూమ్ దగ్గర డ్రాప్ చేయమని ఆ యువతి కోరింది. ఆ బైకర్‌ ఆమె డ్రాప్ చేయడానికి అంగీకరించాడు. తరువాత ఆ యువతి ఆమె స్నేహితుడిని, కారును అక్కడే వదిలిసి వెళ్లింది.

బైక్ పై కూర్చున్న యువతి ఆమె స్నేహితుడికి, తండ్రికి ఎమర్జెన్సీ హెల్ప్ అంటూ మెసేజ్ పెట్టేందుకు మొబైల్ లో అలర్ట్ యాప్ ఆన్ చేసి లొకేషన్ ఆన్ చేసింది. అప్పటికే మెయిన్ రోడ్డు వదిలి లోపలి రోడ్డుపైకి వెళ్లిన బైకర్ నిర్జన ప్రదేశంలోని ఖాళీ షెడ్డు దగ్గర బైక్ ఆపి ఆ యువతిని ఆ షెడ్డులోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఆమె స్నేహితుడికి అలర్ట్ అలారమ్ మెసేజ్ పంపించింది. యువతి స్నేహితుడు పోలీసులను సంప్రదించి ఆ యువతి ఉన్న లోకేషన్ కు చేరుకున్నారని అడిషనల్ పోలీసు కమిషనర్ రామన్ గుప్తా వివరించారు.

పోలీసు వాహనం షెడ్డు వద్దకు వెళ్తుండగా బైక్ పై తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించిన అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే దీనికి ముందు యువతిపై అత్యాచం చెయ్యడానికి యత్నించాడని, ఆమె ప్రతిఘటించడంతో ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టి బట్టలు చింపేశాడని, పోలీసులు చూసేసరికి ఆ యువతి చిరిగిన బట్టలతో అస్వస్థతతో కిందపడి ఉందని, అనంతరం పక్కనే ఉన్న గూడ్స్ వాహనంలో టార్పాలిన్ బట్ట ఆ యువతి మీదకప్పి హెబ్బగోడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు అడిషనల్ పోలీసు కమిషనర్ రామన్ గుప్తా ఇలా వివరించారు.

ఈ ఘటనలో యువతిపై అఘాయిత్యానికి పాల్పడి లైగింక వేధింపులకు పాల్పడడం రుజువు అయ్యిందని, అయితే అత్యాచారం జరిగిందా లేదా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదని, ఇప్పటికే యువతికి వైద్యపరీక్షలు చేశామని, నివేదిక వచ్చిన తర్వాత కచ్చితమైన సమాచారం అందుతుందని బెంగళూరు ఈస్ట్ డివిజన్ అదనపు పోలీసు కమిషనర్ రామన్ గుప్తా మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+