షాక్‌లో బాలీవుడ్: సల్మాన్ ఖాన్ ఇంటిపై మూడు రౌండ్లు కాల్పులు
Salman Khan: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు ఆగట్లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధు మూసేవాలా దారుణ హత్యకు గురైనప్పటి నుంచీ ఆయనకు బెదిరింపు ఫోన్లు, మెయిల్స్ అందుతూనే వస్తోన్నాయి.
సల్మాన్ ఖాన్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు గ్యాంగ్‌స్టర్లు. సల్మాన్ ఖాన్‌ను హత మార్చడమే తన లక్ష్యమంటూ ఇదివరకే లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించుకున్నాడు కూడా. ఈ బెదిరింపుల నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ గన్ లైసెన్స్‌ను మంజూరు చేశారు. ఆయనకు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గన్ లైసెన్స్‌ను కూడా మంజూరు చేశారు.

అయినప్పటికీ- ప్రాణాపాయ బెదిరింపులకు బ్రేకులు పడట్లేదు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నేరుగా ముంబైలో గల సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపారు. మొత్తం మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిగాయి. ఈ తెల్లవారు జామున 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ముంబైలో హైసెక్యూరిటీ జోన్‌గా పరిగణించే బాంద్రా ఏరియాలో ఉంటుంది సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ. అలాంటి సెక్యూరిటీ జోన్‌లో దుండగులు ఏకంగా కాల్పులు జరపడం కలకలం రేగింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయన నివాసానికి చేరుకుని, భద్రతను పర్యవేక్షించారు.
ఇంటిగోడలపై బుల్లెట్లు తగిలిన చోట ఫోరెన్సిక్ నిపుణులు మార్కింగ్ చేశారు. శాంపిళ్లను తీసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. సల్మాన్ ఖాన్ ఇంటి నివాసం వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల ద్వారా ఆగంతకుల కోసం పొలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు.












Click it and Unblock the Notifications