union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు

న్యూఢిల్లీ: దేశం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2023-24ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది గంటల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచ దేశాలు మాంద్యంలో కూరుకుపోతున్న సమయంలో దేశ ఆర్థిక వృద్ధే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెడుతోంది.

కరోనా వైరస్ మహమ్మారి తర్వాత గాడినపడిన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగం అందించే విధంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడం కావడంతో సామాన్యులు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా వేతన జీవులు తమకు సానుకూలంగా ఈ బట్జెట్ ఉంటుందని ఆశిస్తున్నారు.

 union budget 2023: nirmala sitharaman to present budget in parliament in few hours

ముఖ్యంగా వేతన జీవులు తమకు సానుకూలంగా ఈ బట్జెట్ ఉంటుందని ఆశిస్తున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో ఈసారైనా ఊరట కల్పిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యుల జీవన వ్యయం పెరుగుతున్నా 2014 నుంచి వారి ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షల వద్దనే నిలిచిపోవడం గమనార్హం. ఈ పరిమితిని పెంచితే అనేకమంది వేతన జీవులకు ఊరట లభించనుంది.

మరోవైపు, పారిశ్రామిక వర్గాలు కూడా ఈసారి బడ్జెట్ తమకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నారు. వ్యాపారాలపై పన్నులు తగ్గించి, కొన్ని సెస్సులను తొలగించినా ఈ బడ్జెట్ మరింత పన్ను రాయితీలను అందిస్తుందని భావిస్తున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ)ను మరి కొంతకాలం పొడిగించాలని పారిశ్రామిక రంగం ఆశిస్తోంది. అనేక సవాళ్లు, అంచనాల మధ్య బుధవారం ఉదయం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఏదేమైనా ఈ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.

ఈ మొబైల్ యాప్‌లోనూ బడ్జెట్ చూడొచ్చు

కాగా, ఈ బడ్జెట్ ను ప్రభుత్వం సామాన్యులకూ అందుబాటులో ఉండనుంది. పార్లమెంట్ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మొబైల్ యాప్‌లో బడ్జెట్‌లోని ప్రతీ పేజీని వివరంగా చూడొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రసంగం పూర్తయిన తర్వాత యాప్‌లో బడ్జెట్‌ను చూడొచ్చని స్పష్టం చేశాయి. అయితే, కేంద్ర బడ్జెట్‌ను మీ మొబైల్ ఫోన్‌లోనే చూడాలంటే ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ (యూబీ) యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నుంచి కూడా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుసుకుని చూడవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+