డీఎంకే దేశ వ్యతిరేక పార్టీ.. స్టాలిన్‌పై విరుచుకుపడ్డ అమిత్ షా

జాతీయ విద్యా విధానం (NEP) అమలుపై కేంద్ర ప్రభుత్వం - తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతున్న వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార డీఎంకే సర్కార్‌ తీరుపై విరుచుకుపడ్డారు. దేశ వ్యతిరేక పార్టీ డీఎంకే అని .. 2026 ఎన్నికల్లో స్టాలిన్ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపుతారని విమర్శించారు. తమిళనాట ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

తమిళానాడులోని కోయంబత్తూర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాష తమిళం అని, అలాంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని అక్కడి ప్రజలను కోరారు. కేంద్రం తీసుకువచ్చిన త్రిభాషా సూత్రాన్ని అమలును స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నారు. 2024 బీజేపీకి చారిత్రాత్మక సంవత్సరమన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు.

Union Home Minister Amit Shah says DMK Govt will go and NDA Govt will come in Tamil Nadu Elections 2026

కుటుంబ రాజకీయాలను, అవినీతిని అంతం చేస్తూ.. 2026 లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణా ప్రజలు కూడా బీజేపీపై విశ్వాసంతో తమకు అధికారం కట్టబెట్టారని చెప్పారు. తమిళనాడులో శాంతిభద్రతలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని ఆరోపించారు.

నిధుల విషయంలో కేంద్రం చేతిలో తమిళనాడు అన్యాయానికి గురైందరన్న సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. యూపీఏ, ఎన్డీయే హయంలో పంపిణీ చేసిన నిధులు పోల్చి చూసుకుంటే అసలు అన్యాయం ఎవరు చేశారు తెలుస్తుందని హితవు పలికారు. 2014 నుంచి 2024 వరకు మోదీ ప్రభుత్వం తమిళనాడుకు రూ. 5,08,337 కోట్లు నిధులు కేటాయించిందని అమిత్ షా స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+