డేరా ఆశ్రమంలో 'విష కన్యలు': బాబా రాసలీలల కోసం ఏం చేసేవారంటే!..

Subscribe to Oneindia Telugu

చంఢీగఢ్: సాధ్వీలపై అత్యాచారం కేసులో జైలు ఊచలు లెక్కపెడుతున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా రాసలీలలు తవ్విన కొద్ది బయటపడుతున్నాయి. శిష్యురాళ్లనే పడకగదికి పిలిపించుకుని సుఖభోగాలు అనుభవించిన ఈ బాబా.. అందుకోసం ప్రత్యేకంగా 'విష కన్యలు' టీమ్‌ను కూడా నియమించుకున్నాడట.

'సెక్స్' లేక జైల్లో ఇలా!: డేరా బాబాకు అదంటే విపరీతమైన పిచ్చి, ఆస్ట్రేలియా నుంచి ఔషధాలు

బాబా రాసలీల వ్యవహారాలన్ని ఈ విష కన్యల టీమ్ దగ్గరుండి చూసుకునేదని తెలుస్తోంది. ముఖ్యంగా డేరా సచ్చా సౌదా ఆశ్రమంలోని అందమౌన యువతులను బాబా వద్దకు పంపించడంలో వీళ్లు కీలకంగా వ్యవహరించేవారట. మాయ మాటలతో వారిని వలలో వేసుకుని, డేరా బాబా అంతరంగ మందిరానికి తీసుకెళ్లేవారట.

unknown facts of dera baba sexual exploitation

బాబా దీవెనలు లభిస్తే పవిత్రురాలిగా మారుతావంటూ అమాయక అమ్మాయిలను విష కన్యలు మోసం చేసేవారు. వాళ్లు ఎదరుతిరగకుండా చూసే బాధ్యత కూడా వీరిదే. ఎవరైనా అమ్మాయి వీరికి ఎదురుతిరిగితే రోజంతా అన్నపానీయాలు ముట్టనివ్వరు.కుర్చీలో కట్టేసి కొట్టడం వంటివి చేస్తారు.

కీలకమైన హర్డ్‌డిస్క్ స్వాధీనం, బాబా వీడియోలేనా?

ఇక కోపంతో గుర్రుగా చూసే అమ్మాయిలనైతే ముఖంపై మసిపూసి, గాడిదలపై ఊరేగిస్తారు. డేరా బాబాకు శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన గురుదాస్ సింగ్ ఈ విషయాలను పోలీసులకు వెల్లడించాడు. కాగా, విషకన్యలకు సంబంధించి ఇంతవరకు పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కొంతమంది విషకన్యలు ఇప్పటికీ డేరా ఆశ్రమంలోనే ఉన్నట్లు చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dera Sacha Sauda Some unknown facts about Dera Chief’s caveAfter the conviction of Dera Chief under Sadhavi rape case, secrets of his foul activities are starting to open day after day

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి