పాకిస్తానీ నౌకలో పేలుడు పదార్థాలు: ప్రభుత్వ ప్రకటన పాఠం
న్యూఢిల్లీ: ఓ పాకిస్తానీ నౌక ద్వారా ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాన్ని భారత కోస్ట్ గార్డు సిబ్బంది తిప్పికొట్టారు. ఆ నౌక తనను తాను పేల్చేసుకుని అరేబియా సముద్రంలో మునిగిపోయింది. ఆ సంఘటనపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన పాఠం ఇలా ఉంది.
నిఘా సమాచారంతో డిసెంబర్ 31, నిన్న మధ్య రాత్రి భారత కోస్ట్ గార్డు నౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేషన్ చేపట్టాయి. ఆరేబియా సముద్రంలోని ఇండో పాక్ మారిటైమ్ సరిహద్దులో పోరుబందరుకు దాదాపు 365 కిలోమీటర్ల దూరంలో అనుమానాస్పద పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ కు సంబంధించి ఆ ఆపరేషన్ చేపట్టాయి.
కరాచీ సమీపంలోని కేతి బందరు నుంచి ఓ ఫిషింగ్ బోట్ ఆరేబియా సముద్రుంలో అక్రమ రవాణాకు ప్రణాళిక చేసిందని డిసెంబర్ 31వ తేదీన నిఘా సమాచారం అందింది. ఆ సమాచారంతో కోస్ట్ గార్డ్ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ సముద్ర, విమాన సమన్వయ అన్వేషణ సాగించి, అనుమానాస్పద ఫిషింగ్ బోట్‌ను కనిపెట్టింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో గస్తీలో ఉన్న కోస్ట్ గార్డు నౌకను మళ్లించి, పోరుబందరుకు పశ్చిమ - దక్షిణ, దక్షిణాన 365 కిలోమీటర్ల దూరంలో వెలుతురు లేని పడవను డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి అడ్డగించింది.

సిబ్బంది, కార్గో దర్యాప్తునకు ఆగాలని కోస్ట్ గార్డ్ ఓడ హెచ్చరించింది. అయితే, ఆ బోట్ వేగం పెంచి, భారత్ వైపు సముద్ర సరిహద్దు నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. కోస్ట్ గార్డు దాదాపు గంట పాటు ఆ పడవను వెంబడించి, ఫైరింగ్ వార్నింగ్ షాట్స్ చేస్తూ చివరకు పట్టుకోగలిగింది. ఆపి, దర్యాప్తునకు సహకరించాలనే కోస్ట్ గార్డ్ షిప్ హెచ్చరికలను బోట్‌లో ఉన్న నలుగురు కూడా బేఖాతరు చేశారు. ఆ వెంటనే బోట్‌లోని సిబ్బంది డెక్ కంపార్టుమెంటు కింద దాక్కుని బోట్‌కు నిప్పంటించారు, దాంతో పేలుడు సంభవించి, బోట్‌కు మంటలు అంటుకున్నాయి.
చిమ్మచీకటి, వాతావరణ ప్రతికూలత, బలమైన గాలుల కారణంగా బోట్‌ను, అందులోని వ్యక్తులను రక్షించడం గానీ, స్వాధీనంలోకి తీసుకోవడం గానీ చేయలేకపోయారు. జనవరి 1వ తేదీ తెల్లవారు జామును పడవ అదే స్థితిలో కాలిపోయి, మునిగిపోయింది. ఎవరైనా బతికి ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కోస్ట్ గార్డు ఓడలు, ఎయిర్‌క్రాఫ్ట్ అన్వేషణ సాగిస్తున్నాయి. సముద్రం నుంచి ప్రమాదం పొంచి ఉందనే సమాచారంతో గత రెండు నెలలుగా కోస్ట్ గార్డు, ఇత భద్రతా సంస్థలు సముద్ర సరిహద్దులో, కోస్తా తీరంలో గట్టి నిఘా వేసి పెట్టాయి.












Click it and Unblock the Notifications