రూ.10వేలను రూ8 లక్షలు చేసిన స్టాక్!!
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఇటీవల తగ్గింది. కరోనా సమయంలో చాలా మంది ఇంటి దగ్గరే ఉండటంతో.. యువత స్టాక్ మార్కెట్ వైపు ఆకర్షితులయ్యారు. అప్పట్లో స్టాక్ మార్కెట్లు కూడా బాగా పుంజుకున్నాయి. అయితే ఒక ఏడాది నుంచి మాత్రం దలాల్ స్ట్రీట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. ఐపీఓలు రావట్లేదు. దీనివల్ల డీమ్యాట్ ఖాతాలు తగ్గిపోయాయి.
పదేళ్లలో రూ.10 లక్షలు:అయినా కొన్ని స్టాక్స్ మాత్రం పెట్టుబడిదారుల పంట పండిస్తున్నాయి. మార్కెట్లపై మంచి అవగాహన ఉండి, నిపుణుల సలహాతో సరైన స్టాక్స్ కొనుగోలు చేసిన వారికి ఊహించనిరీతిలో లాభాలు వచ్చాయి. అలాంటి ఒక మల్టీబ్యాగర్ స్టాక్.. రూ. 10 వేల పెట్టుబడిని 10 సంవత్సరాల వ్యవధిలో ఏకంగా రూ.10 లక్షలు చేసింది. అందులో ఒక లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టివుంటే ఎంత వచ్చేవో ఊహకే అందడంలేదు.

1200 శాతం పెరుగుదల:అలాంటి ఒక స్టాకే యూఎన్‌ఓ మిండా లిమిటెడ్ (UNO Minda Limited). గత పదేళ్లలో ఈ స్టాక్ భారీగా పుంజుకుంది. పెట్టుబడిదారులకు ఏకంగా 8000 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ లెక్క ప్రకారం 10 సంవత్సరాల కిందట ఈ స్టాక్‌లో రూ.10 వేలు పెట్టుబడి పెట్టినవారికి ఇప్పుడు రూ. 8 లక్షల లాభం వచ్చింది. గడిచిన ఐదేళ్లలో చూస్తే 1200 శాతం, గత మూడేళ్లలో 611 శాతం మేర రిటర్న్స్ వచ్చాయి.
దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలన్నీ..:ఈ కంపెనీ ఆటోమేటివ్ సొల్యూషన్స్ లో ఉంది. ఆల్టర్‌నేట్ ఫ్యూయల్ సిస్టమ్స్, ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్స్, కేనిస్టర్స్, బ్రేక్ హోసెస్ వంటివి తయారు చేస్తుంది. కావాసాకి, ఫోర్డ్, నిస్సాన్, బీఎండబ్ల్యూతోపాటు ఇతర దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. ఇందులో ప్రమోటర్ల వాటా 70.06 శాతంగా ఉంటే, పబ్లిక్ షేర్ హోల్డర్ల వాటా 29.94 శాతంగా ఉంది.












Click it and Unblock the Notifications