నార్వే ఆఫ్ ఇండియా.. రహస్య స్వర్గం.. ఎలా చేరుకోవాలి..?

భారత్ లో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని పచ్చిక బయళ్లు, ఎత్తయిన పర్వతాలు, లోయలు, జలపాతాలు, హిమపాతాలు, నదులు, సరస్సులు, సముద్రాలు, అటవీ ప్రాంతాలు.. ఇలా ఒక్కటేమిటీ సమస్తం భారత్ లో ఉన్నాయి. అయితే భారత్ లోని ఓ ప్రాంతాన్ని నార్వే ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. అదే అరుణాచల్ ప్రదేశ్ లోని దిబాంగ్ వ్యాలీ. ఈ వ్యాలీ.. ఎఫ్ జార్డ్ వ్యాలీస్ కు ప్రత్యేకమైనది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని నర్కందా వ్యాలీ.. మంచు కొండలు, కోనిఫెరస్ అడవులు, యూరోప్ లో మాదిరి శీతాకాల వాతావరణ అందాలు కనువిందు చేస్తున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్ లోని దిబాంగ్ వ్యాలీ.. లోతైన లోయలు, సహజసిద్ధమైన ప్రకృతి, అందమైన జలపాతాలు, సరస్సులు దర్శనమిస్తాయి. ఈ వ్యాలీ సముద్ర మట్టానికి దాదాపు 2 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశాన్ని అరుణాచల్ ప్రదేశ్ రహస్య స్వర్గం అని స్థానికులు పిలుస్తుంటారు. అరుణాచల్ ప్రదేశ్ లో జన సాంద్రత చాలా తక్కువ. అందుకే ఈ ప్రాంతం ఎప్పుడూ నిర్మలంగా, ప్రశాంతంగా.. రద్దీ లేకుండా ఉంటుంది. ఇక్కడ ఓ చదరపు కిలోమీటర్ కు కేవలం ఒక వ్యక్తి కంటే తక్కువ మాత్రమే జన సాంద్రత ఉంది.

అలాగే దిబాంగ్ వ్యాలీ.. వన్య ప్రాణులకు స్థిరమైన ప్రదేశంగా ఉంది. అరుదైన జంతువులైన మిష్మీ టాకిన్ ఇక్కడ కనిపిస్తుంటుంది. ఈ జంతువు మేక ఆకారంలో ఉంటుంది. అలాగే ఈ వ్యాలీలో ఆయుర్వేద, ఔషధ గుణాలు కలిగిన మొక్కలకు ప్రసిద్ధి చెందింది. అరుదైన ఔషధ గుణాలు కలిగిన మిష్మీ టీటా అనే మొక్క ఇక్కడ లభ్యం అవుతుంది. ఈ మొక్కను సంప్రదాయ వైద్యంలో వినియోగిస్తుంటారు.

Unveiling Dibang Valley Arunachal s Hidden Nordic Paradise

దిబాంగ్ వ్యాలీలో మిపీ, ఆలిన్యే, ఆంగ్రిమ్ వ్యాలీ, అచెనో పర్వతాలు పర్యటకులను కనువిందు చేస్తుంటాయి. ఇక్కడి మెహావో వైల్ లైఫ్ శాంక్చురీ, దిబాంగ్ వన్య ప్రాణుల అభయారణ్యం ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ వన్య ప్రాణుల అభయారణ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే ఇక్కడ ఉన్న సెవెన్ లేక్స్ ట్రెక్ పర్యాటకులను మరింతగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి ఏడు సరస్సులను ఓకేసారి చూసి రావచ్చు. అలాగే వ్యాలీలోని మెహావో సరస్సు కూడా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. సాలీ సరస్సు మంచి టూరిస్ట్ ఎట్రాక్షన్ గా ఉంది.

ఇక హైదరాబాద్ నుండి న్యూ టిన్సుకియా జంక్షన్ కు రైలులో చేరుకోవచ్చు. ఇది దిబాంగ్ వ్యాలీకి అతి దగ్గరలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్. అక్కడి నుంచి ట్యాక్సీ, బస్సుల్లో దిబాంగ్ వ్యాలీ చేరుకోవచ్చు. అయితే అరుణాచల్ ప్రదేశ్ ను సందర్శించడానికి పర్యాటకులు ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) పొందాలి. ఆన్‌ లైన్‌ లో లేదా ప్రధాన నగరాల్లోని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని పొందొచ్చు. ఇక దిబాంగ్ వ్యాలీకి దగ్గరలోని విమానాశ్రయం అస్సాంలోని డిబ్రూగర్ విమానాశ్రయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+