Video: అంతా చూస్తుండగానే కానిస్టేబుల్ భర్తను చితకబాదిన భార్య, బట్టలు చించేసి..!

లక్నో: ఓ మహిళ తన భర్తను చితకబాదిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తన భర్తను దుర్భాషలాడి, కొట్టి, అతని బట్టలు చింపేసింది మహిళ. అయితే, ఈ తతంగమంతా అక్కడున్నవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో.. కాన్పూర్‌లోని ఓ పార్క్‌లో మహిళ ఆ వ్యక్తిపై దాడి చేయడాన్ని చూడవచ్చు. ఆమె అతడ్ని చెంపదెబ్బలు కొట్టింది. దుర్భాషలాడుతూ బట్టలు చించివేసింది.

UP: constables second wife thrashes him, tears clothes in public

"నేను అతని భార్యను, అతనికి ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయి" అని సదరు మహిళ ఆరోపించింది. కాగా, వీడియోలో ఉన్న వ్యక్తి కానిస్టేబుల్ దుర్గేష్ సోంకర్ అని, మహిళ అతని రెండవ భార్య అని నౌబస్తా పోలీసులు తెలిపారు.

మొదటి భార్యతో ఉన్నప్పటికీ దుర్గేష్ తనను పెళ్లి చేసుకున్నాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు నెలల క్రితం దుర్గేష్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు ఉన్నతాధికారులు.

కాగా, దుర్గేష్‌కు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని దాడి చేసిన ఆ మహిళ ఆరోపించింది. వీరిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+