తల నరికి ఇంటికి పట్టుకెళ్లాడు.. !!

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో శనివారం నాడు చోటు చేసుకున్న ఓ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. 25 ఏళ్ల ఓ ఐస్‌క్రీమ్ సెల్లర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ 50 ఏళ్ల వ్యక్తి అతన్ని బహిరంగంగా హత్యచేశాడు. అందరి ముందూ తలనరికాడు. అనంతరం తలను తీసుకుని ఇంటికెళ్లిపోయాడు. ఈ భయానక ఘటన ప్రజల కళ్ళముందే జరగడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బారాబాంకి జిల్లాలోని పార్సవాల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐస్‌క్రీమ్‌ అమ్ముకోవడానికి బబ్లూ అనే యువకుడు ప్రతిరోజూ ఆ గ్రామానికి వస్తుంటాడు. శనివారం కూడా అతను ఐస్‌క్రీమ్ విక్రయించడానికి వచ్చాడు. శంకర్ యాదవ్ అనే వ్యక్తి అతన్ని అడ్డుకున్నాడు. ఐస్ క్రీమ్ కొనలాంటూ గట్టిగా చెబుతుండటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన ప్రాంతంలో ఐస్‌క్రీమ్ అమ్మవద్దని బబ్లూను ఆపాడు. దీంతో వారి మధ్య మాటమాట పెరిగి, తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.

UP Incident Shocks as a Ice Cream Seller Beheaded in Barabanki Suspect Arrested Over Verbal Dispute

పరిస్థితి అదుపుతప్పి, ఘర్షణకు దారి తీసింది. అది కాస్తా తీవ్ర రూపం దాల్చింది. దీంతో శంకర్ యాదవ్ తన దగ్గర ఉన్న కొడవలితో బబ్లూపై దాడి చేశాడు. బహిరంగంగానే అతని గొంతు కోశాడు. అతన్ని వారించడానికి స్థానికులు ప్రయత్నించినప్పటికీ వినిపించుకోలేదు. వారినీ చంపేస్తానంటూ భయపెట్టాడు. కొడవలితో వీరంగం సృష్టించాడు. ఈ దారుణ హత్య అనంతరం నిందితుడు బాబ్లూ తలను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం నిందితుడు శంకర్ యాదవ్ ఇంటికి వెళ్లి చూడగా, ఏమీ తెలియనట్టుగా వంట చేసుకుంటూ కనిపించాడు. అతని పక్కనే బబ్లూ తెగిన తల ఉండటాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అతన్ని అక్కడికక్కడే అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై స్పందించిన పోలీసు సూపరింటెండెంట్ అర్పిత విజయవర్గీయ, నిందితుడు శంకర్ యాదవ్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు. సంఘటన జరిగిన సమయంలో అతనిలో అస్థిరత లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు. బబ్లూ మృతదేహం అగ్నిప్రమాదానికి గురై పాక్షికంగా కాలిపోయిందని తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+