తలాక్ తలాక్ తలాక్.. వాట్సాప్‌లో చెప్పిన భర్త, పోలీసులకు బాధితురాలి కంప్లైంట్
ముజఫర్‌నగర్ : ముస్లిం మహిళల కోసం కేంద్రం ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చిన కొందరు మారడం లేదు. కేసు నమోదుచేసి జైళ్లో వేసే చట్టం అమల్లోకి వచ్చినా వారిలో ఏ మాత్రం ఛేంజ్ రాలేదు. చట్టం అమల్లోకి వచ్చినా తెల్లవారే ముంబైలో ఒకతను వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. బాధిత మహిళ స్రీన్ షాట్ తీసి ఫిర్యాదు చేసినా సంగతి తెలిసిందే. తాజాగా యూపీలో బాధిత మహిళకు భర్త తలాక్ చెప్పాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో .. వారు కేసు నమోదు చేశారు.
యూపీలోని సిఖేడ జిల్లా బిహరీ గ్రామానికి చెందిన యువతికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. కొన్నాళ్లపాటు వారి సంసారం సాఫీగానే సాగింది. తర్వాత భర్త ఉపాధి కోసం కువైట్ వెళ్లిపోయాడు. తర్వాత అతని కుటుంబసభ్యులు యువతిని వేధించడం ప్రారంభించారు. అదనపు కట్నం తేవాలని హరస్ మెంట్ ఎక్కువైంది. రూ. 5 లక్షలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కుటుంబసభ్యులకు భర్త కూడా వంతపాడారు. దీంతో బాధితురాలి భర్త, కుటుంబసభ్యులపై వరకట్నం కేసు పెట్టారు. ఈ కేసు విచారణకు కుటుంబసభ్యులు హాజరవుతున్నారు. దీంతో భర్త కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నాడు. దానికి ఆమె కట్నం వేధింపుల గురించి ప్రశ్నించడంతో .. మిన్నకుండిపోయాడు. కట్నం అడగమని భరోసా రాకపోవడంతో మహిళ కేసు విత్ డ్రా చేసుకోలేదు.

ఈ ఏడాది మే 27న కుటుంబసభ్యులపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు మహిళ. దీంతో కుటుంబసభ్యులు, భర్త నుంచి మరింత ఒత్తిడి పెరిగింది. కానీ కట్నం తీసుకురమ్మనే అనడం విశేషం. ఈ క్రమంలో భర్త కేసు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఆమె నిరాకరించగా .. వాట్సాప్ కాల్ చేసి తలాక్ చెప్పాడు. తన భర్త తనకు తలాక్ చెప్పాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతను విదేశాల్లో ఉండటంతో నోటీసులు జారీచేసే అవకాశం ఉంది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications