బలవంతంగా కిస్ పెట్టబోతే.. ఆ పార్ట్ కొరికేసిన ప్రియురాలు!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విచిత్రమైన, సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన మాజీ ప్రియుడి అఘాయిత్యాన్ని ప్రతిఘటించిన తీరు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. బలవంతంగా ముద్దు పెట్టడానికి ప్రయత్నించినందుకు ఆ మహిళ అతడి నాలుకను కొరికేసింది. ఈ క్రమంలో అతడి నాలుక కొంత భాగం తెగిపోవడంతో అతడు విలవిలలాడిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంపీ(35) అనే వ్యక్తికి గతంలోనే పెళ్లి జరిగింది. కానీ పెళ్లి కానీ ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సదరు యువతికి ఆమె కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో పెళ్లి చేయడానికి నిశ్చయించారు. ఈ క్రమంలోనే ఆమె పెళ్లికి సిద్ధమవుతోంది. దీంతో ఆమె తన మాజీ ప్రియుడైన చంపీని దూరం పెట్టడం ప్రారంభించింది. తన ప్రియురాలు తన నుంచి దూరం కావడం, మరొకరితో పెళ్లికి సిద్ధపడటం చంపీని బాధించింది. దీంతో అతను తరచూ ఆమెను కలవడానికి, మాట్లాడించడానికి ప్రయత్నించేవాడు.

చెరువు గట్టున.. నాలుక తెగిపోయింది..
సోమవారం మధ్యాహ్నం పొయ్యికోసం మట్టిని సేకరించడానికి ఆమె చెరువు వద్దకు ఒంటరిగా వెళ్లింది. ఆమెను ఒంటరిగా చూసిన చంపీ ఆమెను అనుసరించి చెరువు వద్దకు చేరుకున్నాడు. చంపీ ఆమెను బలవంతంగా పట్టుకుని వేధించడం ప్రారంభించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి, అతడిని నెట్టేయడానికి ప్రయత్నించినా, అతను తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు.చంపీ తనను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించగా.. ఆ మహిళ ఆత్మరక్షణలో భాగంగా అతడి నాలుకను అత్యంత గట్టిగా కొరికింది. దీంతో చంపీ నాలుకలో కొంత భాగం తెగి, తీవ్రమైన రక్తస్రావం జరిగింది.
చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు
తీవ్రమైన నొప్పితో, రక్తస్రావంతో చంపీ గట్టిగా అరుస్తుండటంతో చుట్టుపక్కల గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారు చంపీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం కాన్పూర్‌లోని ఒక పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశారు.డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దినేష్ త్రిపాఠి ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ధ్రువీకరించారు. మాజీ ప్రియుడి అఘాయిత్యాన్ని ప్రతిఘటించి, నాలుక కొరికిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications