ఘోరం: భర్తను చెట్టుకు కట్టేసి, బిడ్డను చంపుతామంటూ వివాహితపై గ్యాంగ్‌రేప్

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను చెట్టుకు కట్టేసి, బిడ్డను చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేసి... ఓ మహిళపై నలుగురు కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను చెట్టుకు కట్టేసి, బిడ్డను చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేసి... ఓ మహిళపై నలుగురు కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అడ్డుకున్న దుండగులు..

అడ్డుకున్న దుండగులు..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ దంపతులు తమ మూడు నెలల చిన్నారిని ఆస్పత్రిలో చూపించి బైక్‌పై ఇంటికి వస్తుండగా నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. కారులో వచ్చిన వారు ఆయుధాలతో బెదిరింపులకు దిగారు.

బిడ్డను చంపుతామంటూ.. భర్త ఎదుటే..

బిడ్డను చంపుతామంటూ.. భర్త ఎదుటే..

తుపాకులతో బెదిరించిన దుర్మార్గులు.. మహిళ నుంచి చిన్నారిని లాక్కున్నారు. ఆమె భర్తను తీవ్రంగా కొట్టారు. అనంతరం వారిని సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లారు. అక్కడ భర్తను చెట్టుకు కట్టేసి అతడి కళ్లఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి దుండగులు పారిపోయారు.

కన్నీటిపర్యాంతమైన బాధితురాలు

కన్నీటిపర్యాంతమైన బాధితురాలు

ఆ దుర్మార్గులు తన బిడ్డను చంపేస్తామని బెదిరించారని, తన భర్తను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారని బాధితులు కన్నీటిపర్యాంతమైంది. తుపాకీ గురిపెట్టి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. దుండగులు పారిపోయిన తర్వాత అటుగా వచ్చిన కొందరు రైతులు మమ్మల్ని కాపాడి ఆస్పత్రికి తరలించారని, వారే పోలీసులకు ఫోన్‌ చేశారని బాధితురాలు తెలిపింది.

గతంలోనూ ఇలంటి ఘటన

గతంలోనూ ఇలంటి ఘటన

ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా, గత సంత్సరం బులంద్‌షహార్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అర్ధరాత్రి కార్లో వెళ్తున్న ఓ కుటుంబాన్ని అడ్డుకున్న దుండగులు.. వారిపై దాడి చేశారు. అనంతరం ఇతర కుటుంబం సభ్యుల్ని చెట్టుకు కట్టేసి.. కారులోని తల్లి, కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+