UPI: సర్వర్ డౌన్, యూపీఐ వినియోగదారులకు షాక్!
దేశ వ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(UPI) సర్వర్ డౌన్ అయ్యింది. దీంతో ఆన్‌లైన్ చెల్లింపులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా మంది వినియోగదారులు లావాదేవీలను చేయలేకపోయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. బుధవారం రాత్రి 7.50 గంటల నుంచి 2750 యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. గూగుల్ పే వినియోగదారుల నుంచి 296 ఫిర్యాదులు వచ్చాయి. యూపీఐ సర్వర్ డౌన్ అయ్యిందని.. యూపీఐ లావాదేవీలు కావడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. బ్యాలెన్స్ తనిఖీ చేయడం కూడా సాధ్యం కావడం లేదని చెబుతున్నారు.

తనకేనా? దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉందా? అంటూ పలువురు యూపీఐ వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు. దీంతో తాము కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కుంటున్నామంటూ మరికొంత మంది వినియోగదారులు స్పందిస్తున్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) స్పందించింది. యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడిన విషయాన్ని ధృవీకరించింది. సాంకేతిక సమస్యల కారణంగా యూపీఐ సేవలపై తాత్కాలికంగా ప్రభావం పడినట్లు తెలిపింది. ఇప్పుడు సమస్య పరిష్కారమైందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు 'ఎక్స్'వేగికగా వ్యాఖ్యానించింది.
UPI Down ⚠️
— Crypto with Khan ( SFZ ) (@Cryptowithkhan) March 26, 2025
Nationwise issue or it's only me ?
ఇటీవల కాలంలో యూపీఐ చెల్లింపులు సర్వసాధారణం అయిన విషయం తెలిసిందే. టీ స్టాల్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థల్లోనూ యూపీఐ పేమెంట్స్ విరివిగా జరుగుతున్నాయి. యూపీఐ చెల్లింపుల సౌలభ్యం వచ్చిన నాటి నుంచీ చాలా మంది ప్రజలు తమ వెంట ఎక్కువ మొత్తంలో నగదు కూడా తీసుకెళ్లడం లేదు. ఈ క్రమంలో సర్వర్ డౌన్ కావడంతో యూపీఐ వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు.
-
ఈ ఫోటోలో ఉన్న గుడ్లగూబను కనిపెట్టగలరా..? -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్పగలరా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications