యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ -2025 రిజల్ట్స్ రిలీజ్..!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ (CSE) మెయిన్స్ -2025 పరీక్ష ఫలితాలను ప్రకటించింది. UPSC CSE మెయిన్స్-2025 పరీక్షలు ఆగస్టు 23, 24, 30, 31 తేదీలలో నిర్వహించింది. మొత్తం 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్‌కు అర్హత సాధించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ https://upsc.gov.in/, https://www.upsconline.gov.in లలో ఫలితాలను చూడవచ్చు. ఎంపికైన వారి ర్యాంక్, పేపర్ ‌జాబితాను వెబ్ సైట్ లో ఉంచారు.

మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) కోసం పిలుపు వస్తుంది. ఇది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇతర గ్రూప్ A మరియు గ్రూప్ B కేంద్ర సర్వీసులలో ఎంపికకు కీలకంగా నిలుస్తుంది. కాగా పర్సనాలిటీ టెస్ట్‌ల తేదీలను త్వరలో కమిషన్ వెల్లడిస్తుంది. ఈ ఇంటర్వ్యూలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం, ధోల్‌పూర్ హౌస్, షాజహాన్ రోడ్, న్యూఢిల్లీ 110069 చిరునామాలో జరుగుతాయి.

upsc-civil-services-mains-2025-examination-results-released

మెరిట్ లిస్ట్ PDF ఎలా డౌన్‌లోడ్ చేయాలి...?

అభ్యర్థులు యూపీఎస్సీ CSE మెయిన్స్ మెరిట్ లిస్ట్ PDFను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది పద్ధతులను పాటించాలి.

1. ముందుగా, upsc.gov.in లేదా upsconline.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. హోమ్‌పేజీలో, "UPSC CSE Mains toppers list PDF link" పై క్లిక్ చేయండి.
3. UPSC CSE మెయిన్స్ మెరిట్ లిస్ట్ 2025 PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది.
4. ఆ PDFను మీ డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్‌లో సేవ్ చేసుకోండి.

భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోండి. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు.

ముఖ్య సూచనలు..

ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు అన్ని అసలు పత్రాలను, ఫోటో ఐడీ ప్రూఫ్‌లు సిద్ధం చేసుకోవాలి.

మెయిన్స్ ఫలితాలపై ఎటువంటి సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఉంటే, అభ్యర్థులు UPSC హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+