వైద్యులపై దాడి చేస్తే జైలే: ఏడేళ్ల వరకు, రూ.5 లక్షల ఫైన్, నాన్ బెయిలబుల్ కేసు: కేంద్రం
కరోనా వైరస్ రక్కసి జడలువిప్పి నాట్యం చేస్తుంటే ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యం అందిస్తోన్న సిబ్బంది రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైద్య సిబ్బంది/ క్లినిక్‌పై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఘటన తీవ్రతను బట్టి ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని స్పష్టంచేశారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు.

ఉపేక్షించం..
వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. వైద్య సిబ్బంది రక్షణ కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపింది.ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 చట్టానికి సవరణలు చేస్తామని పేర్కొన్నారు. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్రతో అమల్లోకి రానుంది. వైద్యుల రక్షణకు భరోసా లభిస్తోందని చెప్పారు. వైద్యులు.. ఆశా కార్యకర్త నుంచి వైద్యుడి భద్రతకు కట్టుబడి ఉన్నామని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్రమంత్రులు అమిత్ షా, హర్షవర్థన్ వైద్యులతో మాట్లాడారని గుర్తుచేశారు.

రెండింతల జరిమానా..
క్లినిక్‌పై దాడి చేస్తే రెండింతల జరిమానా ముక్కుపిండి మరీ వసూల్ చేస్తామని జవదేకర్ పేర్కొన్నారు. వైద్యులపై దాడి చేస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. కేసు తీవ్రతను బట్టి 3 నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించేలా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. వైద్యులపై దాడి తీవ్రత ఉంటే లక్ష రూ.5 లక్షల జరిమానా.. ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించేలా చర్యలు తీసుకుంటానమి చెప్పారు. దాడిచేసిన వారికి సంబంధించి 30 రోజుల్లో విచారణ పూర్తిచేసి, ఏడాదిలోపు జైలుశిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

50 లక్షల బీమా
విధుల్లో ఉన్న సిబ్బందికి రూ.50 లక్షల వరకు జీవిత భీమా అందిస్తామని కేంద్రమంత్రి జవదేకర్ పేర్కొన్నారు. దేశంలో 735 కోవిడ్ ఆస్పత్రుల్లో రోగులకు చికిత్సను అందిస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులకు సంబంధించి పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌ల కొరత లేదని తేల్చిచెప్పారు. 90 లక్షల ఎన్ 95 మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
Recommended Video
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications