స్వదేశానికి భారత అక్రమ వలసదారులు: వాట్ నెక్స్ట్..?

Donald Trump: అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు.

అక్రమంగా నివసించే భారతీయులను వెనక్కి పంపించే కార్యక్రమానికి అమెరికా తెర తీసింది కూడా. వారిని ఆ దేశ ప్రభుత్వమే వెనక్కి పంపిస్తోంది. విదేశాంగం- రక్షణ మంత్రత్వ సంయుక్తంగా ఈ ఏరివేతను చేపట్టాయి. తొలి దశలో 205 మంది భారతీయులను మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్కించింది. మంగళవారమే సీ-17 ఫ్లైట్ టెక్సాస్ నుంచి బయలుదేరింది.

US army flight carrying 205 deported Indians to land in Amritsar in afternoon today

ఈ మధ్యాహ్నం తరువాత భారత్‌కు చేరుకోనుంది. పంజాబ్‌ అమృత్‌సర్‌లోని శ్రీగురు గోవింద్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. ఈ ఉదయమే ఈ విమానం వస్తుందని భావించనప్పటికీ- అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు. మధ్యాహ్నం తరువాత రావచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫ్లైట్ ఎక్కడ ఉందనే విషయంపై సమగ్ర వివరాలు అందుబాటులో లేవు.

ఈ 205 మంది కోసం అమృత్‌సర్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఇమ్మిగ్రెంట్స్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ తెలిపారు. డిపోర్ట్ అయిన వెంటనే పాస్‌పోర్టులు, ఇతర డాక్యుమెంట్లను తనిఖీ చేస్తామని, వారి స్వస్థలాలకు తరలి వెళ్లడానికి అనుమతి ఇస్తామని చెప్పారు.

ఈ 205 మందిని స్వదేశానికి పంపించడం పట్ల భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. అక్రమ వలసదారులను అరికట్టే క్రమంలో దేశ సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేసుకుంటోన్నామని తెలిపింది. ఇమ్మిగ్రేషన్స్ చట్టాలను మరింత కఠినతరం చేస్తోన్నామని పేర్కొంది.

అక్రమంగా తమ దేశంలో నివసించే వారి పట్ల ఉపేక్షించదలచుకోవట్లేదని తమ ప్రభుత్వం భావిస్తోందని వివరించింది. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా నివసిస్తోన్న వారిని వెనక్కి పంపించే ప్రక్రియ మరింత వేగవంతమౌతుందని, ఈ చర్య అక్రమ వలసదారులకు ఓ స్పష్టమైన సందేశాన్ని పంపించాయని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+