ముంబై, జామ్‌నగర్ పై కన్నేసిన అమెరికా.. ఇండియాకు మార్కో రూబియో!

ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక సమీకరణాల వేళ భారత్-అమెరికాల మధ్య మైత్రి మరింత బలపడుతోంది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికతో ఉన్నత స్థాయి పర్యటనలకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అక్టోబర్ 17 నుంచి 22 మధ్య ఆసియా ప్రాంతంలో కీలక పర్యటన చేపట్టనున్నారు.

ఉజ్బెకిస్తాన్ పర్యటన ముగించుకున్న అనంతరం ఆయన భారత్‌కు రానున్నారు. మన దేశంలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన హబ్‌లుగా వెలుగొందుతున్న ముంబై, జామ్‌నగర్ నగరాల్లో రూబియో ప్రత్యేకంగా పర్యటించనుండటం అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఏడాది మే నెల తర్వాత ఆయన మన దేశానికి రావడం ఇది రెండోసారి కావడం విశేషం.

US Secretary Of State Marco Rubio To Visit Mumbai And Jamnagar In October To Strengthen Energy Ties

ఇంధన భద్రత, పెట్టుబడులే లక్ష్యంగా ద్వైపాక్షిక భేటీలు!

ఈ పర్యటనలో భాగంగా భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో అమెరికా అత్యంత కీలకమైన సమావేశాలు నిర్వహించనున్నారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై లోతుగా అభిప్రాయాలను పంచుకోనున్నారు.

ప్రధానంగా ఇంధన రంగంలో సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. దీనికి తోడు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలతో రూబియో సమావేశమై పరస్పర వాణిజ్య పెట్టుబడులు, ఆర్థిక పురోగతికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.

భారత్-ఇరాన్ భేటీ.. అమెరికా మాస్ వార్నింగ్!!
భారత్-ఇరాన్ భేటీ.. అమెరికా మాస్ వార్నింగ్!!

ఉజ్బెకిస్తాన్ వేదికగా 'C5+1' సదస్సులో భాగస్వామ్యం!

భారత్ పర్యటనకు రాకముందు మార్కో రూబియో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే 'C5+1' విదేశాంగ మంత్రుల స్థాయి సదస్సులో ఆయన పాల్గొంటారు. అమెరికాతో పాటు మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కమేనిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ ఉన్నతాధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో అమెరికాకు చెందిన 200 మందికి పైగా దిగ్గజ వ్యాపారవేత్తలతో కూడిన బృందం కూడా పాల్గొంటోంది. దీనిద్వారా మధ్య ఆసియా ప్రాంతంలో శాంతి, ఆర్థిక ప్రగతితో పాటు అమెరికా వాణిజ్య రంగానికి కొత్త ఊపిరి పోయవచ్చని వాషింగ్టన్ భావిస్తోంది.

మోదీ - ట్రంప్ సంభాషణ.. రక్షణ, ఐటీ రంగాల్లో వేగంగా భాగస్వామ్యం!

ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ఫోన్‌లో సంభాషించిన నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి పర్యటన ఖరారు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య మైత్రిని ఆకాశానికెత్తేశారు.

భార‌త్- అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం: మార్కో రూబియో
భార‌త్- అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం: మార్కో రూబియో

ఇటీవల రాజస్థాన్‌లో నిర్వహించిన 'తరంగ్ శక్తి' యుద్ధాభ్యాసంలో 500 మందికి పైగా బలగాలతో పాటు తొలిసారి F-35 విమానాలు పాల్గొనడం రక్షణ రంగానికి ఉన్న ప్రాధాన్యతను చాటిచెప్పిందన్నారు. ఐటీ రంగంలో పరస్పర పెట్టుబడులు, ఫార్మా రంగానికి సంబంధించి భారత్ సరఫరా చేసే జెనెరిక్ మందులపై ఉన్న నమ్మకాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ వరుస పరిణామాలతో రాబోయే రోజుల్లో భారత్-అమెరికాల మధ్య సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుందని స్పష్టమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+