మైనర్ రేప్ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేకి 25 ఏళ్లు జైలు శిక్ష, ఎక్కడ జరిగిందంటే?, పబ్లిక్ గా వెళ్లి!
బాలికపై అత్యాచారం చేశాడనే కేసులో 25 ఏళ్ల శిక్ష పడిన బీజేపీ ఎమ్మెల్యే రామదులర్ గుండ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సభ్యత్వం కోల్పోయే పరిస్థితి నెలకొంది. సోన్‌భద్ర జిల్లాలోని దుడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అయిన బీజేపీ నాయకుడు రామదులర్ గుండ్ బాలిక మీద పదేపదే అత్యాచారం చేశాడని ఆరోపణలు రావడంతో కేసు విచారణ చేసిన ప్రత్యేక కోర్టు నిందితుడికి 25 ఏళ్ల శిక్ష విధించింది.
అత్యాచారం కేసులో ఎమ్మెల్యే రామదులర్ గుండ్ దోషిగా నిర్ధారించిన రెండు రోజుల తర్వాత సోనభద్రలోని స్థానిక కోర్టు ముందు శుక్రవారం పోలీసులు భారీ బందోబస్తుతో నిందితుడు రామదులర్ గుండ్ ను హాజరుపరిచారు. ఇదే సమయంలో కోర్టు తీర్పును ప్రకటించింది. శుక్రవారం, ఎమ్మెల్యే రామదులర్‌ను గట్టి పోలీసు భద్రత మధ్య కోర్టుకు తీసుకువచ్చారు. ఎమ్మెల్యే రామదులర్ గుండ్ కు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10.5 లక్షల జరిమానా కూడా విధించింది.

మొత్తం జరిమానాను బాధితురాలికి చెల్లించాలని కోర్టు ఆదేశించిందని సోన్ భద్ర స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్య ప్రకాష్ త్రిపాఠి తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 (అత్యాచారం), 506 (సాక్ష్యం అదృశ్యం మరియు తప్పుడు సమాచారం ఇవ్వడం) మరియు పోక్సో చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద కోర్టు ఎమ్మెల్యే రామదులర్ గుండ్ ను దోషిగా నిర్ధారించింది.
ప్రాసిక్యూషన్ ప్రకారం 2014 నవంబర్ 4వ తేదీన సాయంత్రం బాలిక మూత్ర విసర్జన చేయడానికి సమీపంలోని పొలానికి వెళ్లినప్పుడు ఎమ్మెల్యే రామదులర్ గుండ్ ఆమెను లైంగికంగా వేధించి, అత్యాచారానికి ప్రయత్నించాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాలిక ఆ విషయం ఆమె అన్నకు తెలిపింది. తనను బెదిరించి గత ఏడాది కాలంగా రామ్‌దులర్ గుండ్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు తన సోదరుడికి చెప్పిందని బాధితురాలు న్యాయవాది వికాస్ షాక్యా తెలిపారు.
విచారణలో నేను 1998లో పుట్టానని ఆ అమ్మాయి పోలీసులకు, కోర్టుకు చెప్పింది. అయితే ఆ అమ్మాయి 1994లో పుట్టిందని ఎమ్మెల్యే రామదులర్ గుండ్ అమ్మాయి స్కూల్ రికార్డును కోర్టుకు ఇచ్చారని త్రిపాఠి తెలిపారు. ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేయనున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులర్ తరపు న్యాయవాది రామ్ బ్రిక్ష్ తివారీ మీడియాకు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రామదులర్ గుండ్ తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి విజయ్ సింగ్‌పై విజయం సాధించారు. అయితే బాలికపై అత్యాచారం చేశాడని బీజేపీ ఎమ్మెల్యే రామదులర్ గుండ్ కు 25 ఏళ్ల జైలు శిక్ష పడటం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications