యోగి ఆదిత్యనాథ్ ఇంట్లో పెను విషాదం: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స: కన్నుమూసిన తండ్రి..!

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆనంద్ సింగ్ భిష్త్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేశ రాజధానిలోని ప్రఖ్యాత అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్)లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం 10:44 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

ఈ విషయాన్ని ఉత్తర ప్రదేశ్ హోం మంత్రిత్వ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవినాష్ కే అవస్థి ధృవీకరించారు. ఆనంద్ సింగ్ భిష్త్ అనారోగ్య కారణాల వల్ల మరణించినట్లు చెప్పారు. కొంతకాలంగా ఆనంద్ సింగ్ భిష్త్ డీహైడ్రేషన్, లో-బీపీ, కిడ్నీ, లివర్ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఆయనను ఎయిమ్స్‌లో చేర్చారు. అక్కడే చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు. అత్యవసర చికిత్స అందిస్తూ వచ్చారు.

Uttar Pradesh Chief Minister Yogi Adityanath’s father Anand Singh Bisht passes away

అయినప్పటికీ..డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. వెంటిలేటర్‌ను కొనసాగిస్తూనే, ప్రత్యేక డాక్టర్లతో కూడిన బృందం ఆయనకు వైద్య చికిత్సను అందించింది. అవి ఫలించకపోవడంతో ఉదయం 10:44 నిమిషాలకు భిష్త్.. తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణించినట్లు సమాచారం అందే సమయానికి యోగి ఆదిత్యనాథ్ రాజధాని లక్నోలో వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఉన్నారు.

Recommended Video

    Sadhguru Jaggi Vasudev Biography | Oneindia Telugu

    తండ్రి మరణించిన సమాచారం అందుకున్న వెంటనే ఆయన ఈ సమావేశాన్ని రద్దు చేశారు. హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సాయంత్రానికి భిష్త్ పార్థివ దేహాన్ని లక్నోకు తీసుకుని రావచ్చని తెలుస్తోంది. లక్నో లేదా వారణాశిలో అంత్యక్రియలను నిర్వహించే అవకాశం ఉనట్లు సమాచారం. ఈ సమాచారం తెలిసిన వెంటనే పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకులు యోగి ఆదిత్యనాథ్‌కు సంతాపాన్ని తెలియజేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+