అఖిలేష్ ఫోటోలతో ఉన్న రేషన్ కార్డులు వెనక్కి, యోగి ఆదేశాలు
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ పాలన వాసనలను రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఫోటోల
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ పాలన వాసనలను రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఫోటోలున్న రేషన్ కార్డులను వెనక్కి తీసుకోనున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే అఖిలేష్ ప్రభుత్వం దాదాపుగా నాలుగు కోట్ల రేషన్ కార్డులను ముద్రించింది. అయితే దాదాపుగా ఈ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేసింది.

అయితే అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో ఇంకా 80 లక్షలకు పైగా రేషన్ కార్డులు పంపిణీ చేయకుండా మిగిలిపోయాయి.అయితే ఈ రేషన్ కార్డులపై అఖిలేష్ యాదవ్ ఫోటో ఉంది.
సమాజ్ వాదీ పార్టీ రంగులు ఎరుపు, ఆకుపచ్చ కలర్ లో ఈ కార్డులను ముద్రించారు.అయితే పంచకుండా మిగిలిన కార్డులతో పాటుగా కార్డులన్నింటిని కూడ యోగి ప్రభుత్వం వెనక్కి తీసుకొంటుంది.
రేషన్ కార్డులపై ప్రభుత్వ పెద్దల ఫోటోలు ఉండకూడదని సిఎం నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయంలో భాగంగానే ఆయన రేషన్ కార్డులను వెనక్కి తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications