Instagram : ఇన్ స్టా రీల్స్ కు లైక్, షేర్ చేస్తారా లేదా ? పిల్లలకు టీచర్ల టార్చర్..!

ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ఉదయం నిద్ర లేచింది చాలు సోషల్ మీడియా యాప్స్ లో బిజీగా ఉండటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. దాంతో పాటే వాటి ద్వారా డబ్బు సంపాదన కూడా వ్యసనంగా మారింది. ఇందుకోసం ఏం చేసేందుకైనా తెగించే పరిస్ధితులు కూడా నెలకొంటున్నాయి. ఇలాగే పలు స్కూలు టీచర్లు తాము ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేయడం, వాటిని లైక్ చేయండి, షేర్ చేయండంటూ విద్యార్ధుల్ని టార్చర్ పెడుతున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలో పలు ప్రాధమిక పాఠశాలల విద్యార్ధులు,వారి తల్లితండ్రులు తమ టీచర్లపై ఫిర్యాదులు చేస్తున్నారు. టీచర్లు ఇన్ స్టా గ్రామ్ లో అకౌంట్లు క్రియేట్ చేసుకుని వాటిని సబ్ స్క్రైబ్ చేయాలని, వాటిలో పెట్టే రీల్స్ ను లైక్ కొట్టాలని, షేర్ చేయాలని తమను వేధిస్తున్నట్లు వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. స్కూలు టైమింగ్స్ లోనే ఇలా ఇన్ స్టా రీల్స్ చేయడం, వాటి వ్యూస్ కోసం ఇలా విద్యార్ధుల్ని వేధిస్తున్న వ్యవహారంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

uttar pradesh teachers forced students to like and share their instagram reels

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో టీచర్లలో ఒకరు రోజూ స్కూల్‌లో షూట్ చేస్తారని, మరొక టీచర్ వారిని షూట్ చేస్తారని విద్యార్ధులు చెబుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఒకటి 'రవిపూజ' పేరుతో ఉంది. పాఠశాలలో విధుల్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ను సృష్టిస్తున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. ఇలా ఓ టీచర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను లైక్, షేర్ , సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయంలో చర్య తీసుకోవాలని కోరుతూ జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)ని ఆశ్రయించారు. దీనిపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.

సదరు టీచర్ పాఠశాలలో రీల్స్ రికార్డ్ చేస్తుందని, వాటిని లైక్, షేర్ చేయమని విద్యార్థులను ఒత్తిడి చేస్తుందని వారు ఆరోపించారు. అలా చేయకపోతే మమ్మల్ని కొడతామని ఆమె బెదిరిస్తుందన్నారు. మరో విద్యార్ధి కూడా టీచర్ తన కోసం వంటలు చేయమని, ఆహారం వండమని, టీ పెట్టమని విద్యార్థులను బలవంతం చేశారని ఆరోపించారు. పాఠశాలలో సరైన విద్య అందడం లేదని పలువురు విద్యార్థులు వాపోయారు. రీల్స్‌ను లైక్ చేయమని బలవంతం చేసే ఉపాధ్యాయుల వేధిస్తున్న తీరుపై తల్లితండ్రులు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+