లవ్ జిహాద్‌పై యోగి సర్కారు ఉక్కుపాదం: కీలక బిల్లుకు యూపీ అసెంబ్లీ ఆమోదం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ యాంటీ లవ్ జిహాద్, బలవంతపు, మోసపూరిత మత మార్పిడుల వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలిపింది. యూపీ మంత్రి సురేశ్ కన్నా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 'లవ్ జిహాద్' పేరుతో కుట్ర పన్ని బలవంతంగా మత మార్పిడికి యత్నిస్తే 20 ఏళ్ల జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తామని యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు లవ్ జిహాద్‌కు పాల్పడితే రూ. 50 వేల జరిమానాతోపాటు పదేళ్ల జైలు శిక్ష ఉండేది. కానీ, ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాలని యోగి సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే యాంటీ లవ్ జిహాద్ (మత మార్పిడి వ్యతిరేక) బిల్లులో శిక్ష కాలం పెంచుతూ సవరణలు చేసి అసెంబ్లీలో ఆమోదింపచేసింది.

అంతేగాక, లవ్ జిహాద్ కు పాల్పడినట్లు ఇప్పటి వరకు నేరుగా బాధితులు గానీ, బాధిత కుటుంబం కానీ ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకునేవారు. ఇకపై ఈ నిబంధనలో కూడా సవరణ చేశారు. బలవంతపు మత మార్పిడులపై ఎవరు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు చేశారు. పోలీసులకు లిఖితపూర్వకంగా కన్వర్షన్లపై ఫిర్యాదు చేయవచ్చు.
లవ్ జిహాద్ కేసులను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, యాంటీ లవ్ జిహాద్ బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్ నవంబర్ 2020న విడుదల చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఆమోదంతో యాంటీ లవ్ జిహాద్ చట్టం 2021ని తక్షణమే అమల్లోకి తీసుకురానుంది.
హిందూ యువతులే లక్ష్యంగా ప్రేమ ముసుగులో వివాహం చేసుకుని ముస్లిం మతంలోకి మార్చే కుట్ర (లవ్ జిహాద్) దేశంలో జరుగుతోందని బీజేపీ గత కొంతకాలంగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది హిందూ యువతులను కుట్రపూరితంగా మతం మార్చారని, ఇకపై అలాంటివి జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications