దెబ్బతిన్న ఊపిరితిత్తులు: విషమించిన ముఖ్యమంత్రి ఆరోగ్యం: హుటాహుటిన ఎయిమ్స్‌కు షిఫ్ట్
డెహ్రాడున్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన్ను హాస్పిటల్‌కు తరలించిన కొన్ని క్షణాలకే ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరో అప్‌డేట్ వచ్చింది.ఆయనను అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో అడ్మిట్ చేశారు. ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఆదివారం రాత్రి వరకూ హోమ్ క్వారంటైన్‌లో గడిపారు. ఆరోగ్యం విషమించడంతో రాత్రికి రాత్రి రాజధాని డెహ్రాడున్‌లోని డూన్ ఆసుపత్రికి తరలించారు. రావత్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఎయిమ్స్‌కు షిఫ్ట్ చేశారు.
త్రివేంద్ర సింగ్.. కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ నెల 18వ తేదీన ఆయనకు కరోనా వైరస్ సోకింది. అప్పటి నుంచి ఆయన హోమ్ ఐసొలేషన్‌లో ఉంటున్నారు. ఆయన భార్య, కుమార్తెకు కూడా కోవిడ్ బారిన పడ్డారు. వారందరూ హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. అక్కడే వైద్య చికిత్స తీసుకుంటున్నప్పటికీ.. రావత్ ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడలేదు. మరింత విషమించింది. దీనితో ఆయనను రాత్రికి రాత్రి డూన్ ఆసుపత్రిలో చేర్చారు. వీఐపీ వార్డులో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. రాత్రంతా ఆయనకు అత్యాధునిక వైద్య చికిత్స అందించినప్పటికీ.. ఫలితం కనిపించలేదు. ఆరోగ్యం మరింత విషమించింది.

శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా.. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలింది. ఆయన కోసం ప్రత్యేెకంగా డాక్టర్లను పిలిపించినట్లు డూన్ వైద్య కళాశాల, ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ అశుతోష్ సయానా తెలిపారు. ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించామని పేర్కొన్నారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఏర్పడటం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎయిమ్స్ తరలించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని నిర్ధారించింది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications