Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాలంటైన్ స్పెషల్ ట్రిప్.. లవర్స్ ఇష్టపడే బెస్ట్ రొమాంటిక్ ప్రదేశాలు ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 14 వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు లవర్స్ తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ప్రేమికులు తమ అభిమానాన్ని వ్యక్త పరచడానికి, బహుమతులు కూడా ఇచ్చి పుచ్చుకుంటారు. అయితే ప్రేమికుల రోజును ఎంజాయ్ చేసేందుకు ప్రేమికులు ఎక్కువగా కెనడా, అమెరికా, యునైటేడ్ కింగ్‌ డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్, డెన్మార్క్ తదితర దేశాలకు వెళ్తుంటారు. అయితే మనదేశంలోనే ప్రకృతి రమణీయమైన ప్రదేశాల మధ్య మీకు ఇష్టమైన వ్యక్తితో ఎంచక్కా గడపొచ్చు. భారత్ లోనే చాలా రొమాంటిక్ ప్రదేశాలు ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

కేరళలోని అలప్పుజ ప్రాంతాన్ని ఈస్టెర్న్ వెనిస్ గా పిలుస్తుంటారు. బ్యాక్‌ వాటర్స్, హౌస్ ‌బోట్ ప్రయాణాలు, ప్రశాంతమైన బీచ్‌ లకు ప్రసిద్ధి చెందిన అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ఇది చెప్పొచ్చు. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు సందర్శించడానికి బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. ఏటా ప్రేమికుల రోజు సమయంలో బ్యాక్ వాటర్, రిసార్ట్స్ లో వాలంటైన్ పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ అలప్పుజ బీచ్, మరారి బీచ్, కుట్టనాడ్, అంబలపుజ శ్రీకృష్ణ దేవాలయం తదితర ప్రదేశాలు పర్యటకులను ఆకర్షిస్తుంటాయి.

అలాగే కొడగు ప్రదేశానికి కూడా లవర్స్ ఈ సమయంలో తరలివెళ్తుంటారు. ఈ సీజన్ లో కొడగు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి పచ్చని కొండలు, టీ, కాఫీ తోటలు, మీకు ఏకాంతం అలాగే ప్రశాంతతను కలిగిస్తాయి. కొడగు ప్రాంతాన్ని ఇండియా స్కాట్లాండ్ అని పిలుచుకుంటారు. దట్టమైన అడవులు, జలపాతాలు అలాగే పొగమంచుతో నిండిన కొండలతో ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ అబ్బే జలపాతం, రాజా సీట్, తలకావేరి (కావేరి నది జన్మస్థలం) ప్రధాన సందర్శనీయ స్థలాలుగా ఉన్నాయి.

వాలంటైన్ వీక్ లో ట్రిప్ కు సౌత్ గోవా బెస్ట్ ప్లేస్ అని కొందరు చెబుతుంటారు. ఇక్కడి బీచ్ లో జనాలు తక్కువగా ఉంటారు. అందువల్ల ఫుల్ ఎంజాయ్ చేయొచ్చని జంటలు భావిస్తుంటాయి. ఏకాంతంగా తమకు ఇష్టమైన వారితో గడిపేందుకు, రిలాక్స్ అయ్యేందుకు ఈ ప్రాంతంలో రిసార్ట్స్ ఉంటాయి. ఈ ప్రాంతం పలోలెం, అగోండా, కోల్వా బీచ్‌ లకు, దూద్‌ సాగర్ జలపాతం, చారిత్రక చర్చిలు సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందాయి. నార్త్ గోవా కంటే ఈ సౌత్ గోవా చాలా ప్రశాంతంగా ఉంటుంది.

Valentine Special Trip for lovers Alappuzha Coorg South Goa and the forts of Rajasthan other

ఇక రాజస్థాన్ లోని జైపూర్ కోటల్లో వాలంటైన్స్ డే కు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. ఇక్కడ వాలంటైన్స్ వీక్ లో ఏటా లవర్స్ కోసం పలు ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలోని సరస్సులు, కేప్ లు, రిసార్ట్ లు ప్రేమికులతో నిండిపోతుంటాయి. అలాగే రాజస్థాన్ కోటల సౌరభం ఇక్కడి పర్యటకులను కట్టిపడేస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+