వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఎర్ర గులాబీ 'తో ఆ రెండు రాష్ట్రాలకు నష్టం, జాగ్రత్తలు తీసుకొంటున్న రాష్ట్రాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:తమిళనాడు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలను వర్థా తుఫాన్ భయపెడుతోంది. .వర్థా అంటే' ఎర్ర గులాబీ ' అని చెబుతారు. అరబిక్, ఉర్థూ బాషల్లో వర్థా అంటే ఎర్రగులాబీ అని అర్థం వస్తోంది. ఈ తుఫాన్ కు వర్థా అని పాకిస్తాన్ పేరు పెట్టింది.బంగాళాఖాతంలో పుట్టిన నాలుగవ అతి పుట్టిన నాలుగవ భీకర తుఫాన్ అని,అధికారులు చెబుతున్నారు.

హిందూ మహాసముద్రంలో అంతర్భాగమైన బంగాళాఖాతంలో పుట్టిన నాలుగవ భీకరమైన తుఫాన్ గా అధికారులు చెబుతున్నారు. గతంలో రోహాన్, క్యాంత్, నాాడా తుఫానులు వచ్చాయి. వాటి తర్వాత వర్థా తుఫాన్ వచ్చింది.ఈ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు తీవ్రమైన వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కారణాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

varda cyclone

తుఫాన్లకు పేరు ఎవరు పెడతారు

తుఫాన్లకు పేర్లు పెట్టే ఆచారం 1953 నుండి ఉంది. అట్లాంటిక్, ఫసిఫిక్ ప్రాంతాల్లో తుఫానులకు పేర్లు పెడుతున్నారు. అయితే అరేబియా , హిందూ మహాసముద్రాల్లో కూడ వచ్చే తుఫానులకు 2004 నుండి పేర్లు పెడుతున్నారు.తుఫాన్ల వల్ల జరిగే నష్టాన్ని ఈ తుఫాన్ల గురించి ముందస్తుగా హెచ్చరికలు జారీచేసేందుకుగాను తుఫాన్లకు పేర్లు పెట్టాలని అంతర్జాతీయ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్ధీవులు మయన్మార్, శ్రీలకం , థాయ్ లాండ్ లాంటి దేశాల నుండి 64 తుపాన్ పేర్ల జాబితాలను ప్రకటించాయి.ఈ జాబితా నుండే ఆయా తుఫాన్లకు పేర్లను ఇస్తున్నారు. ప్రస్తుతం వర్థా తుపాన్ పేరును గతంలోనే పాకిస్తాన్ సూచించింది.

ప్రజలు కూడ తుపాన్లకు పేర్లు పెట్టే అవకాశం ఉంది. అయితే తుఫాన్లకు పేర్లు సూచించే సమయంలో ఆయా ప్రాంతాలు, సంస్కృతి, సంప్రదాయాలనుప్రాంతాలను, దేశాలను అవమానపర్చేవిధంగా ఉండేలా కాకుండా అందరూ గుర్తుపెట్టుకొనేలా , రెండు లేదా మూడు అక్షరాలతో వచ్చే పేర్లను సూచిస్తే వాటిని తుఫాన్లకు పెట్టే అవకాశం ఉంది.తాము సూచించే పేర్లను ఐఎండి కార్యాలయంలోని మెటరాలజీ డైరెక్టర్ జనరల్ కు సూచించాల్సి ఉంటుంది.

English summary
pakistan select name of varda for this cyclone.red rose is the meaning for varda,in arabic, urdu languages red rose is the meaning for varda.from the 1953 continues the select the names for cyclones. for caution about cyclones, record the loses create the names for cyclones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X