Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

25 ఏళ్ల తరువాత స్మగ్లర్ వీరప్పన్ ప్రధాన అనుచరుడి అరెస్టు; అజ్ఞాత జీవితంలో !

అడవిదొంగ, గంధపు చెక్కల స్మగ్లర్, కిల్లర్ వీరప్పన్ ప్రధాన అనుచరుడిని 25 ఏళ్ల తరువాత కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని రామాపుర పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరు: అడవిదొంగ, గంధపు చెక్కల స్మగ్లర్, కిల్లర్ వీరప్పన్ ప్రధాన అనుచరుడిని 25 ఏళ్ల తరువాత కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని రామాపుర పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని సత్యమంగల తాలుకా నివాసి శివస్వామి అలియాస్ డబుల్ గుండి (52) అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

స్మగ్లర్ వీరప్పన్ ప్రధాన అనుచరుల్లో శివస్వామి ఒకరు. ఇతను 25 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. శివస్వామి మీద అనేక కేసులు ఉన్నాయి. ఇంతకాలం తప్పించుకుని తిరుగుతున్న శివస్వామి కోసం కర్ణాటక- తమిళనాడు సరిహద్దులోని రామాపురం పోలీసులు గాలిస్తున్నారు.

Veerappan aide Shivaswamy arrested in Tamil Nadu

తమిళనాడులోని ఈరోడ్ జిల్లా డిజి. పుదురు గ్రామంలో శివస్వామి తలదాచుకున్నారని సమాచారం సేకరించిన రామాపురం పోలీసులు ఇతన్ని అరెస్టు చేసి స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి అనుమతితో శివస్వామిని కర్ణాటకలోని చామరాజనగర జిల్లాకు తీసుకు వచ్చారు.

1992లో మైనింగ్ వ్యాపారి సంపగి రామయ్య కుమారుడు రామమూర్తిని కిడ్నాప్ చేసిన కేసులో, కర్ణాటక మాజీ మంత్రి చిన్నగౌడర్ కిడ్నాప్, హత్య కేసులో, 1993లో హాలార్ మందుపాత పేలుడుతో పాటు అనేక కేసుల్లో శివస్వామి నిందితుడు. ఈ కేసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న శివస్వామి తమిళనాడులోని ఈ రోడ్ జిల్లాలో అజ్ఞాతజీవితం గడుపుతున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+