ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా అశోక్ వేమూరి?

Subscribe to Oneindia Telugu
  Infosys Top Choice For CEO Is Ashok Vemuri | Oneindia Telugu

  బెంగళూరు: ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ ఎవరో దాదాపు ఖరారైంది. ఇటీవల సీఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేసి సంస్థ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో మాజీ సీనియర్ ఉద్యోగి అయిన అశోక్ వేమూరి బాధ్యతలు చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

  సీఈఓ ఎంపిక కోసం నియమితమైన ఈగోన్ జెండర్ తోపాటు ఇన్ఫోసిస్ నామినేషన్స్ కమిటీ గత రెండు వారాలుగా ఈ ప్రక్రియపై కసరత్తులు చేసింది. అశోక్ వేమూరినే ఆ కమిటీ సూచించినట్లు తెలిసింది. కాగా, వేమూరి ప్రస్తుతం జిరాక్స్ బిజినెస్ సర్వీసెస్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

  Vemuri may be Infy’s top choice for CEO

  ఇంతకుముందు ఆయన ఐగేట్ కార్పొరేషన్ అధినేతగా వ్యవహరించారు. దీన్ని ఆ తర్వాత క్యాప్‌జెమినీ చేజిక్కించుకుంది. అయితే, దాదాపు అశోక్ వేమూరిని ఖరారు చేసినట్లేనని చెబుతున్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం ఇన్ఫోసిస్ నుంచి వెలువడలేదు.

  ఇంతకుముందు అశోక్ పని చేసిన సంస్థలు లాభాల బాటలోకి రావడంతో ఆయన వైపు ఇన్ఫోసిస్ మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఐగేట్‌లో పనిచేసిన సమయంలో అశోక్ వేమూరి వచ్చిన ఒక ఏడాదిలోనే రెట్టింపు లాభాలను ఆ సంస్థ నమోదు చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్.. వేమూరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇన్ఫోసిస్ అధినేత నందన్ నీలేకని ఈ అంశం(వేమూరి నియామకం)పై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Infosys is understood to have reached out to Ashok Vemuri, a former top employee to take over as CEO after Vishal Sikka exited the software major recently.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి