భారత ఉపరాష్ట్రపతి రాజీనామా..!
దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం (జులై 21, 2025) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపించారు.
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా
— oneindiatelugu (@oneindiatelugu) July 21, 2025
- అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్‌ఖడ్
- 2022 జులై 16న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ధన్‌ఖడ్ - ప్రధానికి, రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ధన్‌ఖడ్#JagadeepDhankhand #VicePresident #NewsUpdate #Oneindiatelugu pic.twitter.com/cOekrpeDGV
ఈ హఠాత్ నిర్ణయానికి అనారోగ్య సమస్యలే కారణమని ధన్‌ఖడ్ తన లేఖలో పేర్కొన్నారు. దేశ అత్యున్నత పదవులలో ఒకటైన ఉపరాష్ట్రపతి బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఎటువంటి ముందస్తు సూచన లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాలను, ప్రజలను ఆశ్చర్యపరిచింది.

జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో వ్యవహరిస్తూ వచ్చారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆయన సమర్థవంతంగా వ్యవహరించారు. ఈ పరిణామం దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.ఇప్పుడు ఆయన రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు కాబోతున్నారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications