పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు: పోలీసులను కుమ్మేయండన్న కార్పొరేటర్ అరెస్టు, వీడియో వైరల్

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా అహ్మదాబాదులో నిరసన కార్యక్రమం జరిగింది. తే ఆందోళనకారులు అహ్మదాబాద్ పోలీసుపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తతవాతావరణం నెలకొంది. అయితే పోలీసుపై దాడి చేయాల్సిందిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ కార్పొరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో 48 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్‌లోని షా-ఈ-అలామ్ ప్రాంతంలో గురువారం నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారును చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు.

ఇక పోలీసులకు ఆందోళనకారులకు మధ్య జరిగిన గొడవలో 26 మంది పోలీసులు గాయపడ్డారు. వారిపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అయితే ఆందోళనకారులను కాంగ్రెస్ కార్పొరేటర్ షెహజాద్ ఖాన్ పఠాన్ రెచ్చగొట్టడంతోనే వారు రాళ్లు రువ్వారని పోలీసులు తెలిపారు.గాయపడిన పోలీసుల్లో డీసీపీ బిపిన్ అహైర్, ఏసీపీ ఆన్బీ రానా మరియు ఇన్స్‌పెక్టర్ జేఎం సోలంకిలు ఉన్నారు. వీరంత ఇసాన్ పూర్ పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆందోళనలు చేపట్టి పోలీసులపై దాడి చేసిన 5వేల మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఇన్స్‌పెక్టర్ సోలంకి చెప్పారు. మరో 50 మంది పేర్లను కేసులో జతచేర్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ కార్పొరేటర్ షెహజాద్ ఖాన్ పఠాన్‌తో పాటు మొత్తం 49 మందిని గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Video goes viral:Congress corporator arrested for Provoking protestors in Ahmedabad

కాంగ్రెస్ కార్పొరేటర్ షెహజాద్ ఖాన్ పఠాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వెళుతుండగా... పోలీసులపై కక్ష తీర్చుకోండంటూ ఆందోళనకారులను రెచ్చగొట్టారని ఇన్స్‌పెక్టర్ సోలంకి చెప్పారు. అంతేకాదు ఒక్క పోలీసు కూడా మిగల్చకుండా చూడాలని రెచ్చగొట్టినట్లు సోలంకి తెలిపారు. ఆయన పిలుపును అందుకున్న ఆందోళనకారులు పోలీసులపై దాడికి దిగారు. ఇక ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. తమను తాము రక్షించుకునేందుకు పోలీసు వాహనాల వెనక్కు వెళ్లి పోలీసులు దాక్కున్నారు.మరో క్లిప్పింగ్‌లో ఒక పోలీసును కిందేసి కొందరు సామూహిక దాడి చేసినట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+