Viral Video: రద్దీ రహదారిపై స్కూటీపై వెళుతూనే స్నానం చేసిన యువతీయువకుడు

ముంబై: ఇటీవల కాలంలో కొంతమంది నేటి తరం యువత ఏదో ఒకటి చేసి వార్తల్లో ఉండాలని చూస్తున్నారు. ఇలా కొందరు పిచ్చి పనులు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా, ఓ యువ జంట స్కూటర్‌పై వెళుతూనే స్నానం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. స్కూటీపైనే వాటర్ బకెట్, మగ్ తెచ్చుకుని స్నానం చేశారు.

మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించినందుకు ఆ జంటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Video Of Couple Bathing While Riding Scooty Goes Viral

రద్దీగా ఉండే రహదారిలో ఆ జంట వింత చేష్టలు స్థానికులను షాకింగ్‌కు గురిచేసింది. ఓ యువతీ యువకుడు స్కూటర్‌పై వెళుతూనే స్నానం చేస్తున్నారు. ఈ ఘటన ఉల్హాస్‌నగర్‌లో చోటు చేసుకుందిన ఓ సీనియర్ జర్నలిస్టు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

ఆ జంటపై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్థానిక ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రద్దీగా ఉండే రహదారిపై ఇలాంటి వింత చేష్టలు చేయడం ప్రజలకు ఇబ్బందులను కలిగిస్తాయని పలువురు వ్యాఖ్యానించారు. స్థానికులు కూడా ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో విషయం మహారాష్ట్ర డీజీపీ వరకు వెళ్లింది. దీంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. అయితే, మహారాష్ట్రలోని థానే జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత తట్టుకోలేక ఇలా చేశారనుకుందామంటే.. ఎండలో తిరగడం ఎందుకు? ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది కదా అని మరికొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+