viral video:ఏమీ వింత ఇదీ, వానరం, శునకం మధ్య స్నేహామా.. ఆ రెండు ఏం చేశాయంటే..?
ఓకే జాతి జంతువులు మధ్య స్నేహం, సఖ్యత ఉంటుంది. మరో జాతికి చెందిన వాటి మధ్య స్నేహం అరుదు.. గొడవే జరుగుతుంటుంది. కానీ శునకం, వానరం మధ్య స్నేహం రేర్.. ఎందుకంటే ఏవీ కనిపించినా సరే.. గొడవకు దిగుతుంటాయి. చాలా సందర్భాల్లో మనం చుశాం. కానీ ఈ వీడియోలో ఆ రెండు జాతి వైరం మరిచాయి. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

దోస్త్ మేరా దోస్త్..
ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ ఆ రెండు మాత్రం దోస్త్ మేరా దోస్త్ అంటున్నాయి. వీడియో కూడా పాతదేనట.. గత ఏడాది డిసెంబర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది. షాపు వద్ద శునకం.. వానరం ఉన్నాయి. వాటి కన్ను చిప్స్ మీద పడింది. ఇంకేముంది దోచేయాలని అనుకున్నాయి. ఇందుకు శునకం కూడా.. హెల్ప్ చేసింది. దాని మీద ఎక్కిన వానరం.. చిప్ప్ దొంగిలించే ప్రయత్నం చేసింది. ఆ వీడియో చూస్తే ముచ్చట వేస్తోంది.

స్నేహితులు కారని చెప్పగలరా.?
వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మీమ్స్.బీకేఎస్ పేరుతో పోస్ట్ అయ్యింది. దానికి ఎవరూ చెప్పారు కోతి, కుక్క మంచి స్నేహితులు కారని అని పేర్కొన్నారు. దీనికి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చూసిన తర్వాత తనకు స్నేహితుడు గుర్తొచ్చాడు అని ఒకరు.. టీమ్ వర్క్ అంటే ఇదే అని మరొకరు కామెంట్ చేశారు. ఆ రెండు కలిసి మరో లెవల్‌కు వెళ్లారని పేర్కొన్నారు.
తెగ లైకులు..
వీడియోకు ఇప్పటికే 2500 లైకులు వచ్చాయి. 29 వేల వ్యూస్ వచ్చాయి. వాస్తవానికి కోతులు, డాగ్స్ మధ్య స్నేహం ఉండదు. ఇదీ మన పురాణాలు ద్వారా చెబుతున్నాయి. కానీ ఈ వీడియో మాత్రం అదీ నిజం కాదు అని చెబుతుంది. అంతకుముందు కూడా ఓ కోతి శునకంపై జర్నీ చేసే వీడియో మనకు కనిపించింది. ఇదీ రెండేళ్ల క్రితం జరగగా... దానికి 10 లక్షల వ్యూస్ వచ్చాయి. 17 వేల మంది లైక్ కొట్టారు. ఇప్పుడు కొత్త వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications