వామ్మో.. శునకాన్ని నదిలో పడేసి.. వీడియో వైరల్, నెటిజన్ల మండిపాటు..
పెంపుడు జంతువులపై పైశాచికం తప్పే. ఐపీసీ ప్రకారం చర్యలు తప్పవు. శునకం అంటే విశ్వాసం.. కానీ ఓ యువకుడు శునకాన్ని నదిలో విసిరేసి క్షణికానందం పొందాడు. అంతేకాదు వీడియో కూడా తీయడం.. అదీ సోషల్ మీడియాలో షేర్ కావడంతో తెగ వైరలవుతోంది. యువకుడిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ బడా తలాబాద్ వద్ద 20 ఏళ్ల యువకుడు ఉన్నాడు. అయితే తన చుట్టూ రెండు శునకాలు తిరుగుతున్నాయి. ఏమైందో ఏమో గానీ అందుల్లోంచి ఒక దానిని తీసి.. నదిలో పారేశాడు. దీనిని వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. అయితే వీడియోలో బ్యాక్ గ్రౌండ్‌లో కమాండ్ 3 పాట కూడా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఘాటుగా రియాక్టవుతున్నారు. ఘటనపై పోలీసులు కూడా దృష్టిసారించారు.

జంతు సంరక్షణ చట్టం కింద యువకుడిపై కేసు నమోదు చేశారు. యువకుడి మొబైల్ లోకేషన్ ఆధారంగా అతనిని పట్టుకున్నామని తెలిపారు. వీడియోను లేక్ వద్ద గల బోట్ క్లబ్ రోడ్ వద్ద తీశారని ఏఎస్పీ మిశ్రా తెలిపారు. ఘటనపై యూజర్లు తెగ మండిపడుతున్నారు. సదరు యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నదిలో శునకాన్ని వదిలేయడం ఏంటీ అని మండిపడుతున్నారు. ఇది సరికాదు అని జంతు ప్రేమికులు అంటున్నారు. యువకుడిపై జంతు సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇంకొకరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది అని ఆందోళన చెందారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications