కేంద్రానికి వ్యతిరేకంగా పాట పాడిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ; వీడియో వైరల్!!
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అద్భుతమైన పాటను పాడి అందరిని ఆకట్టుకున్నారు. ఆమె గాత్రంతో ప్రతి ఒక్కరి దృష్టి ఆమెపై పడేలా చేశారు. బెంగాలీ భాషలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ పాడిన పాట ఇప్పుడు టాక్ ఆఫ్ ద బెంగాల్ స్టేట్ అయింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తమకు నిధులను విడుదల చేయడం లేదని, ఉపాధి హామీ పథకం తో పాటు అనేక పథకాలకు సంబంధించి నిధులను ఇవ్వడం లేదని, ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రెండు రోజుల ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
తొలి రోజు బిజెపి లేబుల్ ఉన్న అతిపెద్ద వాషింగ్ మెషిన్ ను వేదికపై పెట్టి అందులో నల్లటి వస్త్రాలను వేసి, తెల్లటి వస్త్రాలను బయటకు తీసిన మమతా బెనర్జీ, బిజెపిలోకి వెళ్లిన అవినీతిపరులంతా, మచ్చలేని నాయకులుగా మారుతున్నారు అంటూ బిజెపిని టార్గెట్ చేశారు. ఇక రెండవ రోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె బెంగాలీ భాషలో అద్భుతమైన పాటను పాడి అందరినీ ఆకట్టుకున్నారు. మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కేంద్రంపై మమతా బెనర్జీ పోరాటమే వేరు అని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ సమయంలో మమతా బెనర్జీ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టడం రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. ఇటీవల సాగర్ డిఘీలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టిన మమతా బెనర్జీ ఒకపక్క దిద్దుబాటు చర్యలతో ముందుకు వెళ్లడంతో పాటు, కేంద్రానికి వ్యతిరేకంగా, తమ రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్న కేంద్రం తీరుని ఎండగడుతూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ పాడిన పాటతో అందరి దృష్టి ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజకీయాలపై మళ్లేలా చేసింది.
#WATCH | West Bengal CM Mamata Banerjee sings a Bengali song on the second day of her Dharna in Kolkata, against the Central government for not clearing funds for several schemes including 100 days work. pic.twitter.com/r6CRXCuqty
— ANI (@ANI) March 30, 2023












Click it and Unblock the Notifications