Viral Video: వన్ మినట్‍లో పామును పట్టిన యువతి.. వీడియో వైరల్..
చాలా మందికి పాములంటే భయం ఉంటుంది. కొంత మంది అయితే పామును చూడగానే పరుగెత్తుతారు. ముఖ్యంగా నాగుపాము మరింత ఎక్కువగా భయం ఉంటుంది. అది కాటేస్తే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. కానీ ఓ యువతి ధైర్యంగా నాగు పామును పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో నాగుపాము ఓ కార్యాలయం మెట్ల పైకి వచ్చింది. అక్కడే ఉన్న ఓ యువతి చాకచక్యంగా నాగు పామును పట్టుకుని డబ్బాలో బంధించింది. ఆమె ముందుగా పాము తోక పట్టకుంది. తర్వాత డబ్బాను పాము పడగపై పెట్టింది. మెళ్లిగా పామును డబ్బాలోకి వెళ్లేలా చేసింది. తర్వాత డబ్బా మూత పెట్టింది.

ఆమె పామును పడుతున్నప్పుడు అక్కడున్న వారు వీడియో తీశారు. ఈ వీడియోను ఫిగెన్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు ఈ యువతి పామును ఎలా పట్టుకుందో చూడండి అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
How to catch snake... Brave girl! pic.twitter.com/nxT0a5Jxfe
— Figen (@TheFigen_) January 10, 2023
ఈ వీడియోకు 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 28 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసినవారందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. బ్రేవ్ గర్ల్ అంటూ పొగడుతున్నారు.












Click it and Unblock the Notifications