Leopard Video: అనారోగ్యంగా ఉన్న చిరుతతో ఆడుకున్నారు, స్వారీకి యత్నం

భోపాల్: చిరుతపులి కనిపించిందంటే ఆమడ దూరం పరిగెత్తే జనం.. ఏకంగా దానిమీద ఎక్కి స్వారీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ చిరుత మాత్రం వారిని ఏమీ అనకుండా తనదారిన తాను వెళ్లిపో సాగింది. ఇందుకు అది అనారోగ్యంతో ఉండటమే కారణం. కానీ, జనం మాత్రం దాన్ని ఆసరాగా చేసుకుని చిరుత పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఇక్లేరా గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఒక చిరుత సంచరిస్తూ.. కొందరు గ్రామస్తుల కంట పడింది. దాన్ని చూసి మొదట భయపడిన జనం.. తమపై దాడి చేయకపోవడంతో దగ్గరికి వెళ్లారు. చిరుత అనారోగ్యంతో ఉండటాన్ని గుర్తించారు. అయితే, చిరుత ఆరోగ్య పరిస్థితిపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిపోయి.. దాంతో ఆడుకోవడం మొదలుపెట్టారు.

Video: villagers Harass Sick Leopard In Dewas, Madhya Pradesh state

చిరుత ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ.. దానిపై స్వారీ చేసేందుకు యత్నించారు. ఆ చిరుతమాత్రం అనారోగ్యంతో ఉన్న కారణంగా వారిని పట్టించుకోకుండా వెళ్లిపో సాగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిరుత పట్ల అక్కడి ప్రజలు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

కాగా, ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని.. అక్కడున్న జనాన్ని చెదరగొట్టారు. చికిత్స కోసం చిరుతను ఆస్పత్రికి తరలించారు. ఓ వ్యక్తి చిరుత గురించి తమకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి చేరుకున్నామని అధికారులు తెలిపారు. చిరుత నీరసంతో సరిగా నడవలేని స్థితిలో ఉందని చెప్పారు.

చిరుతకు వైద్యం అందిస్తున్న పశువుల వైద్యులు.. దాని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నామని.. త్వరలో చిరుత ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు వైద్యులు చెప్పారని అటవీశాఖ అధికారి సంతోష్ శుక్లా వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+