Viral Dance: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న స్ట్రీట్ డ్యాన్సర్.. ఇండియన్ మ్యూజిక్‌పై కీలక కామెంట్స్

Street Dancer: ఇటీవల 'ముండియన్ తూ బచ్కే రహి' పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ డాన్సర్ ఎవరో కాదు MT పాప్. ఈ నెల ప్రారంభంలో ముంబైలో జరిగిన రెడ్ బుల్ డాన్స్ యువర్ స్టైల్ వరల్డ్ ఫైనల్స్ 2024 విజేతే అతగాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 21.1 మిలియన్ వ్యూస్‌ను సాధించిన ఈ వీడియో.. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక స్ట్రీట్ డాన్స్ పోటీల్లో నిపుణులైన డాన్సర్ల ప్రదర్శనలకి ఒక ఉదాహరణ మాత్రమే.

వియత్నాంకు చెందిన MT పాప్, ఫైనల్ రౌండ్‌లో ఫ్రాన్స్‌ దేశీయుడు హిప్ హాప్ డాన్సర్ రుబిక్స్‌పై విజయం సాధించారు. ట్రోఫీ గెలుచుకున్న అనంతరం ఆనందాన్ని వ్యక్తపరిచారు. 'డాన్స్ నాకు చాలా ప్రత్యేకం. చాలా మంది 'కేవలం డాన్స్' అంటారు కానీ ఇది నా జీవితం, నా స్నేహితుడు' అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అంతేకాదు డాన్స్ అంటే తనకు ఎంత ముఖ్యమో ఆయన మాటల్లోనూ, కదలికల్లోనూ కనిపిస్తూనే ఉంటుంది.

Vietnam Street dancer dance viral in social media

భారత ఆర్థిక రాజధాని ముంబై గురించి తన అనుభవాలను పాప్ షేర్ చేశారు. 'ఇక్కడి సంస్కృతి నాకు చాలా నచ్చింది. భారతీయ సంగీతం వింటే సహజంగానే నా శరీరం డ్యాన్స్ చేస్తుంది. ఇది ఉల్లాసంగా, సవాలుగా అనిపిస్తుంది. అయినప్పటికీ నేను చాలా బాగా ఆస్వాదిస్తాను' అని పొగడ్తల వర్షం కురిపించారు. కాగా పాప్‌తో పాటు ఇద్దరు భారతీయ కళాకారులు టి మరియు సౌమ్యా కాంబ్లే కూడా ఈ ప్రపంచ ఫైనల్స్‌లో తమ ప్రతిభను కనబరిచారు.

డార్జిలింగ్‌కు చెందిన టి, జాతీయ ఫైనల్స్ గెలిచి ప్రపంచ ఫైనల్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. తనకు టామ్ & జెర్రీ కార్టూన్ బాగా నచ్చుతుందని, టామ్ ఎప్పుడూ ఓడిపోతున్నా జెర్రీకి తలొగ్గకుండా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ స్ఫూర్తితోనే నా పేరును టామ్‌గా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రపంచ ఫైనల్స్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో చోటు పొందిన మరో భారతీయ కళాకారిణి సౌమ్య కాంబ్లే. ఆమె 19 ఏళ్లకే స్ట్రీట్ డాన్స్ నిపుణులకు గట్టి పోటీ ఇచ్చింది. ఇండియాస్ బెస్ట్ డాన్సర్ సీజన్ 2 విజేతగా గుర్తింపు పొందింది. ఇలా భారతీయ కళాకారులు తమ ప్రతిభతో ప్రపంచ వేదికలపై దేశ గౌరవాన్ని పెంపొందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+